ఏడాది పాటు నిర్వహించనున్న “వందేమాతరం” జాతీయ గేయం 150 సంవత్సరాల స్మారకోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 07th, 10:00 am
సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించే ఈ అద్భుతమైన అనుభవం నిజంగా మాటలతో వర్ణించలేనిది. అనేక గళాల్లో... ఒకే లయ, ఒకే స్వరం, ఒకే భావం, ఒకే ఉత్తేజం, ఒకే ప్రవాహంగా సాగే ఈ గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఈ భావోద్వేగ భరితమైన వాతావరణంలో నేను నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాను. వేదికపై ఉన్న నా మంత్రివర్గ సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా గారు, ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా గారు, ఇతర ప్రముఖులు, అలాగే ఈ వేడులకు హాజరైన నా సోదరీ సోదరులారా...జాతీయ గేయం ‘‘వందేమాతరం’’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
November 07th, 09:45 am
దేశాన్ని ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశంగా మాత్రమే చూసేవారికి... అలా కాకుండా తల్లిగా పరిగణించాలనే ఆలోచన ఆశ్చర్యం అనిపించవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, భారత్ ఇందుకు భిన్నం... ఇక్కడ తల్లి అంటే- జన్మనిచ్చేది.. పెంచిపోషించేది మాత్రమే కాదు బిడ్డలకు ప్రమాదం కలిగించే దుష్టశక్తులను అంతం చేసే భద్రకాళి. కాబట్టే- భరతమాత శక్తి అపారమని, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించడమేగాక శత్రు నాశనం చేసిందని చెబుతూ- వందేమాతరంలోని పంక్తులను ఆయన ఉటంకించారు. దేశం ఒక తల్లి కాగా, ఆ తల్లి శక్తిసామర్థ్యాలు ఒక దైవ స్వరూపమనే భావనే స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీ-పురుషులు సమాన భాగస్వాములు కావడానికి దారితీసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నారీశక్తి భారత్‌ను మరోసారి పురోగమన పథంలో నిలపగలదనే స్వప్నాలకు ఊతమిచ్చింది ఈ దార్శనికతేనని చెప్పారు.ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
August 17th, 12:45 pm
కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 17th, 12:39 pm
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.Glimpses from 79th Independence Day at Red Fort in Delhi
August 15th, 11:02 am
On the 79th Independence Day, PM Modi, in his address, paid tribute to the Constituent Assembly, freedom fighters, and Constitution makers. He highlighted key initiatives—GST reforms, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, National Sports Policy, and Sudharshan Chakra Mission—aimed at achieving a Viksit Bharat by 2047.తమిళనాడు తూత్తుకుడిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
July 26th, 08:16 pm
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, నా కేబినెట్ సహచరులు కింజరపు రామమోహన్ నాయుడు గారు, డా. ఎల్. మురుగన్ గారు, తమిళనాడు మంత్రులు తంగం తెన్నరసు గారు, డా. టి.ఆర్.బి. రాజా గారు, పి. గీతా జీవన్ గారు, అనితా ఆర్. రాధాకృష్ణన్ గారు, ఎంపీ కణిమొళి గారు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మన ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ గారు, తమిళనాడు సోదర సోదరీమణులారా!తమిళనాడు తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
July 26th, 07:47 pm
తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రాంతీయంగా అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరచడంతోపాటు.. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంచేలా, శుద్ధ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ రంగాల్లో వరుసగా చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ వీర సైనికులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. సాహసికులైన వీరయోధులకు ప్రణమిల్లారు. దేశం కోసం ప్రాణత్యాగానికీ వెనుకాడని అమరులకు మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ చర్చల శతాబ్ది కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
June 24th, 11:30 am
బ్రహ్మర్షి స్వామి సచ్చిదానంద గారు, శ్రీమఠం స్వామి శుభాంగ నందా గారు, స్వామి శారదానంద గారు, గౌరవనీయులైన సాధువులందరూ, ప్రభుత్వంలో నా సహచరులు శ్రీ జార్జ్ కురియన్ గారు, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ అదూర్ ప్రకాష్ గారు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు, గౌరవనీయులైన పెద్దలందరూ,శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ మధ్య చారిత్రక చర్చ జరిగి శతాబ్ది అవుతోన్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
June 24th, 11:00 am
గొప్ప ఆధ్యాత్మిక, నైతిక విలువలు కలిగిన మహానుభావులు శ్రీ నారాయణ గురు.. మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రక చర్చకు శతాబ్ధి అవుతోన్న సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన దేశ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టానికి ఈ వేదిక సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. మన స్వాతంత్రోద్యమానికి ఈ ఇద్దరు మహానుభావుల మధ్య జరిగిన చారిత్రక చర్చ కొత్త దిశానిర్దేశం చేసిందని.. స్వాతంత్య్ర లక్ష్యాలకు, స్వతంత్ర భారత్ కలకు నిర్దిష్ట అర్థాన్నించిందని పేర్కొన్నారు. “100 సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ నారాయణ గురు- మహాత్మాగాంధీల సమావేశం నేటికీ స్ఫూర్తిదాయకంగా, సందర్భోచితంగా ఉంది. సామాజిక సామరస్యం, అభివృద్ధి చెందిన భారత్ విషయంలో సమష్టి లక్ష్యాల కోసం ఉత్తేజానిచ్చే వనరుగా పనిచేస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాక శతాబ్ధి సందర్భంగా శ్రీ నారాయణ గురు పాదాలకు నమస్కరించిన ప్రధాని.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.భోపాల్‌లోని దేవి అహిల్యాబాయి మహిళా సశక్తీకరణ్ మహా సమ్మేళన్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 31st, 11:00 am
మధ్యప్రదేశ్ గవర్నర్ గౌరవనీయ శ్రీ మంగు భాయ్ పటేల్, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, సాంకేతిక మాధ్యమాల ద్వారా పాలు పంచుకుంటున్న కేంద్ర మంత్రులు- ఇండోర్ నుంచి శ్రీ తో ఖాన్ సాహు, దాటియా నుంచి శ్రీ రామ్మోహన్ నాయుడు, సత్నా నుంచి శ్రీ మురళీధర్ మోహుల్, వేదికను అలంకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ జగదీష్ దేవ్డా, శ్రీ రాజేంద్ర శుక్లా, లోక్‌సభలో నా సహచరులు శ్రీ వి.డి.శర్మ, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీ సోదరులారా!లోకమాత దేవీ అహల్యా బాయి హోల్కర్ 300వ జన్మదినోత్సవ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళనంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 31st, 10:27 am
లోకమాత దేవి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భోపాల్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 'మా భారతి'కి నివాళులు అర్పిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, భారత మహిళా శక్తి గొప్పతనాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, వారు ఈ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు లోకమాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమైన సందర్భం, జాతి నిర్మాణంలో గొప్ప ప్రయత్నాలకు మద్దతునిచ్చే క్షణంగా ఈ సందర్భాన్ని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేవి అహల్యాబాయిని ఉటంకిస్తూ, నిజమైన పాలన అంటే ప్రజలకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడం అని ఆయన పునరుద్ఘాటించారు. నేటి కార్యక్రమం అహల్యాదేవి దార్శనికతను ప్రతిబింబిస్తూ, ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకువెళుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండోర్ మెట్రో ప్రారంభంతో పాటు, దాటియా, సత్నాలకు విమాన కనెక్టివిటీని జోడించడాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తాయని, అభివృద్ధిని వేగవంతం చేస్తాయని అలాగే కొత్త ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.గాంధీనగర్‌లో ‘రెండు దశాబ్దాల గుజరాత్ పట్టణ ప్రగతి పథం’ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 27th, 11:30 am
ఈ వేదికనలంకరించిన గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన నా ప్రియ సోదరీసోదరులారా!గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల ఉత్సవంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 27th, 11:09 am
గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల వేడుకనుద్దేశించి గాంధీనగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. పట్టణాభివృద్ధి సంవత్సరం- 2005కు ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణాభివృద్ధి సంవత్సరం-2025ను ఆయన ప్రారంభించారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో పర్యటన సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయ గర్జనలు, రెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలతో వెల్లివిరుస్తున్న దేశభక్తిని రెండు రోజులుగా ఆస్వాదిస్తున్నానన్నారు. ఈ కనువిందైన దృశ్యం ఒక్క గుజరాత్‌కే పరిమితం కాలేదనీ.. భారత్ నలుమూలలా, ప్రతి భారతీయుడి హృదయమూ ఇదే రకమైన భావనతో ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. “ఉగ్రవాదమనే కంటకాన్ని నిర్మూలించాలని సంకల్పించిన భారత్ దృఢ నిశ్చయంతో దానిని నెరవేర్చింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
April 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
March 30th, 11:53 am
గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత గౌరవనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర గౌరవ ప్రముఖులు, ఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారా! ఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద ఎంతో ప్రత్యేకమైన రోజు. పవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వా, ఉగాది, నవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు ఝులేలాల్ జీ, గురు అంగద్ దేవ్ జీ జయంతి కూడా. ఇవే కాకుండా, ఈ రోజు మన స్ఫూర్తి ప్రదాత, అత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడా. అలాగే, ఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోంది. ఈ సందర్భంలో, ఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించి, గౌరవనీయ డాక్టర్ సాహెబ్, గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి దేశంలోని పౌరులందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యత: ప్రధాని
March 30th, 11:52 am
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి పండుగలు జరుగుతున్నాయన్న ఆయన.. భగవాన్ ఝులేలాల్, గురు అంగద్ దేవ్ జయంతి అయిన ఈ రోజు ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన డాక్టర్ కేబీ హెడ్గేవార్ జయంతి ఇవాళ అని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మహోన్నత ప్రయాణం శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన రోజున డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గోల్వాల్కర్ గురూజీలకు నివాళులు అర్పించటానికి స్మృతి మందిరాన్ని సందర్శించడం ఎంతో గౌరవంతో కూడుకున్న విషయమని అన్నారు.న్యూఢిల్లీలో అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
February 21st, 05:00 pm
గౌరవనీయ సీనియర్ నాయకులు శ్రీ శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి తారా భావల్కర్, మాజీ అధ్యక్షులు డాక్టర్ శ్రీ రవీంద్ర శోభనే, గౌరవనీయ సభ్యులు.. మరాఠీ భాషా పండితులు.. సభకు హాజరైన సోదరీసోదరులారా!98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 21st, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, మరాఠీ భాషకు సంబంధించి రాజధానిలో ఏర్పాటు చేసిన అద్భుతమైన కార్యక్రమంలో మారాఠీ వారందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ఒక భాషకి లేదా ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదని, స్వాతంత్య్ర పోరాట సారాన్ని, మహారాష్ట్ర, దేశ సంస్కృతీ వారసత్వాన్ని కలబోసుకున్నదని అన్నారు.‘ఈటీ నౌ’ ప్రపంచ వాణిజ్య సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 15th, 08:30 pm
క్రితం సారి ఈటీ సమిట్ ఎన్నికలు బాగా దగ్గర పడిన సమయంలో ఏర్పాటయ్యింది. మేం పాలన చేపట్టిన మూడోసారి భారత్ మరింత వేగంతో పనిచేస్తుందని అప్పుడు మీకు సవినయంగా మనవి చేశాను. గుర్తుంది కదా! అప్పుడు ప్రస్తావించిన వేగాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూడగలగడం, దేశం నా ఆశయానికి మద్దతుగా నిలవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా బీజేపీ- ఎన్డీఏకు తమ దీవెనలను అందిస్తున్నారు. వికసిత్ భారత్ (సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం) ఆశయానికి ఒడిశా ప్రజలు గత జూన్ లో మద్దతునివ్వగా, అటు తరువాత హర్యానా ప్రజలు, ఇప్పుడు ఢిల్లీ పౌరులూ భారీ మద్దతును తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలంతా ఏకతాటిపై నిలబడుతున్నారు అనేందుకు ఇదో తార్కాణం!‘ఈటీ నౌ' ప్రపంచ వాణిజ్య సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
February 15th, 08:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఈటీ నౌ’ ప్రపంచ వాణిజ్య సదస్సు-2025లో ఇవాళ ప్రసంగించారు. మూడోదఫా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వ పాలనలో భారత్ సరికొత్త వేగంతో ముందంజ వేస్తుందని మునుపటి ‘ఈటీ నౌ’ సదస్సులో తాను సవినయంగా ప్రకటించానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ వేగం ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తున్నదని, దీనికి యావద్దేశం పూర్తి మద్దతు ఇస్తున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. వికసిత భారత్‌పై తమ నిబద్ధతకు అపార మద్దతు ప్రకటించిన ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, న్యూఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ స్వప్న సాకారంలో పౌరులందరూ భుజం కలిపి నడుస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.