ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 16th, 03:00 pm

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ప్రజాదరణ పొందిన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏలు అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు...

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.13,430 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 16th, 02:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత అహోబిలంలోని నరసింహ స్వామితోపాటు మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పించారు. అలాగే సకలజన సౌభాగ్యం ఆకాంక్షిస్తూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కోరారు.

ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించి ఏడేళ్లయిందన్న ప్రధానమంత్రి

September 23rd, 12:52 pm

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఈ పథకం కోట్లాది మందికి నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఆర్థిక భద్రత, గౌరవాన్ని కల్పించటం ద్వారా ఆరోగ్య సేవలకు కొత్త నిర్వచనమిచ్చిందన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 17th, 11:20 am

మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీ సోదరులారా!

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం

September 17th, 11:19 am

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి - వాగ్దేవికి నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజు దేవశిల్పీ, నైపుణ్యం, సృజనాత్మకతకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతి అని చెబుతూ ఆయనకు శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. హస్త కళా నైపుణ్యం, అంకితభావంతో దేశ నిర్మాణంలో పాలుపంచు కొంటున్న కోట్లాది సోదరీసోదరులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.

వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం

April 11th, 11:00 am

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌధురి, ఆశీస్సులు అందించడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ కుటుంబ సభ్యులందరికీ..

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

April 11th, 10:49 am

ఈ రోజు ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ. 3,880 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, కాశీ నగరంతో తనకు గల గాఢానుబంధాన్ని గురించిన అనుభూతులను పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులు, ప్రాంత ప్రజలు తనకు అందించిన ఆశీస్సులకు, తనపై కురిపించే ఆదరాభిమానాలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందించే ప్రేమ తనను రుణగ్రస్తుడిని చేసిందని, తాను కాశీకి, కాశీ తనకు చెందుతుందన్నారు. రేపు హనుమాన్ జన్మోత్సవమని గుర్తు చేస్తూ, కాశీలోని సంకట మోచన మహారాజ్ ను సందర్శించే గౌరవం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. హనుమాన్ జన్మోత్సవ పావన సందర్భాన్ని జరుపుకోవడానికి ముందస్తుగా అభివృద్ధిని వేడుక చేసుకునేందుకు కాశీ ప్రజానీకం తరలి రావడం హర్షదాయకమన్నారు.

బాగేశ్వర్ ధామ్ వైద్య, వైజ్ఞానిక పరిశోధన సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగం

February 23rd, 06:11 pm

కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి భాయ్ మోహన్ యాదవ్ గారూ, జగద్గురు పూజ్య రామభద్రాచార్య గారూ, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారూ, సాధ్వి రితంబర గారూ, స్వామి చిదానంద సరస్వతి గారూ, మహంత్ శ్రీ బాలక్ యోగేశ్చర దాస్ గారూ, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారూ, ఇతర ప్రముఖులూ... ప్రియమైన సోదరీ సోదరులారా!

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

February 23rd, 04:25 pm

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా గఢా గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ సమయంలోనే రెండో సారి బుందేల్‌ఖండ్‌కు రావడం తనకు దక్కిన సౌభాగ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కేంద్రం బాగేశ్వర్ ధామ్ త్వరలోనే ఆరోగ్య కేంద్రంగా కూడా రూపుదాల్చుతుందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తారని, మొదటి దశలో 100 పడకల సదుపాయం అందివస్తుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర కార్యానికిగాను శ్రీ ధీరేంద్ర శాస్త్రిని ఆయన అభినందిస్తూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీ నాయకత్వం మలేరియాకు వ్యతిరేకంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది, ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు చేసింది: జేపీ నడ్డా

December 16th, 10:06 am

భారతదేశం మలేరియా కేసులలో గణనీయమైన 69% తగ్గింపును సాధించింది, 2017లో 6.4 మిలియన్ల నుండి 2023లో కేవలం 2 మిలియన్లకు పడిపోయింది-ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి కేంద్రీకరించిన విధానాలు మరియు నాయకత్వానికి ఇది స్మారక విజయం. 2015 తూర్పు ఆసియా సమ్మిట్‌లో చేసిన నిబద్ధతతో 2030 నాటికి మలేరియాను నిర్మూలించాలనే ప్రధాన లక్ష్యంలో ఈ మైలురాయి భాగం.

మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 09th, 01:09 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...

మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన

October 09th, 01:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ ప‌నుల‌కు, షిర్డీ విమానాశ్రయంలో కొత్త స‌మీకృత టెర్మినల్ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయి సహా మహారాష్ట్రలో విద్యా వ్య‌వ‌స్థ ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రానికి శ్రీ మోదీ ప్రారంభోత్స‌వం చేశారు.

ప్రధానమంత్రి జన్ జతీయ గ్రామ్ అభియాన్‌కు మంత్రి మండలి ఆమోదం రూ.79,156 కోట్లతో 63,000కు పైగా గిరిజన మెజారిటీ గ్రామాలు,

September 18th, 03:20 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.79,156 కోట్లతో (కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.56,333 కోట్లు, రాష్ట్రాల వాటా: రూ. 22,823 కోట్లు) తీసుకొచ్చిన ఈ పథకాన్ని గిరిజన మెజారిటీ గ్రామాలు, ఆకాంక్షిత జిల్లాల్లోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.

Congress & INDI alliance possess no roadmap, agenda or vision for development of India: PM

March 18th, 08:28 pm

Ahead of the 2024 Lok Sabha elections, PM Modi addressed a public rally in Karnataka’s Shivamogga. He said, “The unwavering support of Karnataka for the BJP has given the corruption-ridden I.N.D.I alliance, sleepless nights”. He said that he is confident that the people of Karnataka will surely vote for the BJP to enable it garner 400+ seats in the upcoming Lok Sabha elections.

Shivamogga’s splendid welcome for PM Modi at public rally

March 18th, 03:10 pm

Ahead of the 2024 Lok Sabha elections, PM Modi addressed a public rally in Karnataka’s Shivamogga. He said, “The unwavering support of Karnataka for the BJP has given the corruption-ridden I.N.D.I alliance, sleepless nights”. He said that he is confident that the people of Karnataka will surely vote for the BJP to enable it garner 400+ seats in the upcoming Lok Sabha elections.

Goal of Viksit Bharat by 2047 can not be achieved without development of deprived segments: PM

March 13th, 04:30 pm

Prime Minister Narendra Modi addressed a program marking nationwide outreach for credit support to disadvantaged sections via video conferencing. Addressing the occasion, the Prime Minister acknowledged the virtual presence of about 3 lakh people from 470 districts and expressed gratitude. Prime Minister Modi underlined that the nation is witnessing another huge occasion towards the welfare dalits, backward and deprived sections.

వెనుకబడిన వర్గాలకు రుణసాయంపై దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 13th, 04:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వెనుకబడిన వర్గాలకు రుణసాయం దిశగా నిర్వహించిన దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. అంతకుముందు ‘‘ప్ర‌ధానమంత్రి సామాజికోత్థాన-ఉపాధి ఆధారిత జ‌న‌సంక్షేమ (పిఎం-సూరజ్) పథకం జాతీయ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే దేశంలోని లక్షమంది బ‌ల‌హీనవర్గాల‌ పారిశ్రామికవేత్త‌ల‌కు రుణ సహాయం మంజూరు చేశారు. అదే సమయంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు.