గుజరాత్‌లోని దేడియాపడలో గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 15th, 03:15 pm
గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 03:00 pm
ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్మదా మాత పవిత్ర భూమి ఇవాళ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, అక్టోబరు 31న ఇక్కడే సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ పర్వ్‌ను ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, భారత్ పర్వ్ పరమావధికి చేరుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శుభ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గోవింద్ గురు ఆశీస్సులు ఈ కార్యక్రమంపై ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. వేదికపై నుంచి గోవింద్ గురుకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించే అదృష్టం కలిగిందన్న ప్రధానమంత్రి.. ఆ మాత పాదాల వద్ద శిరస్సు వంచి ప్రణమిల్లినట్లు తెలిపారు.అనువాదం: నయా రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ రజతోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 01st, 03:30 pm
గౌరవనీయులైన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ డేకా గారు, ప్రజాదరణ గల చైతన్యవంతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సీనియర్ సహచరులు జువల్ ఓరం గారు, దుర్గా దాస్ ఉయ్కే గారు, తోఖాన్ సాహు గారు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్ గారు.. ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో గారు, విజయ్ శర్మ జీ.. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఛత్తీస్‌గఢ్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా…ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 01st, 03:26 pm
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నేడు నవ రాయ్‌పూర్‌లో జరిగిన ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.NDA freed Bihar from Naxalism and Maoist terror — now you can live and vote fearlessly: PM Modi in Begusarai
October 24th, 12:09 pm
Addressing a massive public rally in Begusarai, PM Modi stated, On one side, there is the NDA, an alliance with mature leadership, and on the other, there is the 'Maha Lathbandhan'. He highlighted that nearly 90% of purchases in the country are of Swadeshi products, benefiting small businesses. The PM remarked that the NDA has freed Bihar from Naxalism and Maoist terror, and that every vote of the people of Bihar will help build a peaceful, prosperous state.We’re connecting Bihar’s heritage with employment, creating new opportunities for youth: PM Modi in Samastipur
October 24th, 12:04 pm
Ahead of the Bihar Assembly elections, PM Modi kickstarted the NDA’s campaign by addressing a grand public meeting in Samastipur, Bihar. He said, “The trumpet of the grand festival of democracy has sounded. The entire Bihar is saying, ‘Phir Ek Baar NDA Sarkar!’” Remembering Bharat Ratna Jan Nayak Karpoori Thakur ji, the PM said, “It is only due to his blessings that people like us, who come from humble and backward families, are able to stand on this stage today.”PM Modi addresses enthusiastic crowds in Bihar’s Samastipur and Begusarai
October 24th, 12:00 pm
Ahead of the Bihar Assembly elections, PM Modi kickstarted the NDA’s campaign by addressing massive gatherings in Samastipur and Begusarai, Bihar. He said, “The trumpet of the grand festival of democracy has sounded. The entire Bihar is saying, ‘Phir Ek Baar NDA Sarkar!’” Remembering Bharat Ratna Jan Nayak Karpoori Thakur ji, the PM remarked, “It is only due to his blessings that people like us, who come from humble and backward families, are able to stand on this stage today.”ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 27th, 11:45 am
ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారు. ఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పేరు, చిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుంది. అక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నాను. అతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండి. వెనక మీ పేరు, చిరునామా రాసి ఉంటే, నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. ఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకు, చిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 27th, 11:30 am
ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత నవరాత్రి పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామచండీలు కొలువైన పవిత్ర భూమిని సందర్శించి.. ఇక్కడి ప్రజలను కలిసే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు పాల్గొనడం ఆనందంగా ఉందన్న ప్రధానమంత్రి.. వారి ఆశీర్వాదాలే నిజమైన బలమన్నారు. ప్రజలకు వందనాలు తెలిపిన ఆయన.. అందరికీ శుభాకాంక్షలూ తెలిపారు.సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటన
September 16th, 02:49 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ధార్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ’ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పలు ఇతర కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతోపాటు ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 21st, 07:06 am
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు కె. రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ జాదవ్ ప్రతాపరావు గణపత్‌రావు గారు, చంద్రశేఖర్ గారు, భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీసోదరీమణులందరికీ నా నమస్కారాలు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 21st, 06:30 am
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐవైడీ) కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి సామూహిక యోగా సాధనలో పాల్గొన్నారు.బీహార్‌లోని మధుబనిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సంబంధిత కార్యక్రమంతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 24th, 12:00 pm
నేను నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు, మీకందరికీ ఒక వినతి చేస్తున్నాను... మీరు ఎక్కడ ఉన్న సరే, మీరు కూర్చున్న చోటే.. లేచి నిలబడనక్కర లేదు... మనం కూర్చొని ఉండే, ఈ నెల 22న మనం కోల్పోయిన కుటుంబసభ్యులకు నివాళిని సమర్పిద్దాం... మీరు ఆసీనులై ఉన్న చోటు నుంచే, కొన్ని క్షణాల పాటు మౌనాన్ని పాటించండి... మనం మన ఆరాధ్య దైవాలను స్మరించుకొంటూ, మొన్నటి మృతులందరికీ శ్రద్ధాంజలిని సమర్పిద్దాం. ఇది అయ్యాక, నేను నా నేటి ప్రసంగాన్ని మొదలుపెడతాను.జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా బీహార్లోని మధుబనిలో
April 24th, 11:50 am
ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో కొన్ని ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. వీటన్నింటి మొత్తం విలువ రూ.13,480 కోట్లు. పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మరణించినవారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కార్యక్రమానికి హాజరైన వారిని ప్రధాని కోరారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశమంతా మిథిల, బీహార్‌తో అనుసంధామైందని అన్నారు. బీహార్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్, రైల్వేలు, వసతుల ప్రాజెక్టులను ప్రారంభించామని, శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఇవి బీహార్లో నూతన ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని చెప్పారు. ప్రముఖ కవి రాంధారి సింగ్ దినకర్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.అస్సాం గౌహతిలో ఏర్పాటైన ఝుమోయిర్ బినందిని కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 24th, 06:40 pm
గౌరవనీయ అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ సర్బానంద్ సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, కళాకారులు, అస్సాం సోదర సోదరీమణులు...అస్సాంలోని గౌహతిలో ఝుమోయిర్ బినందిని కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి
February 24th, 06:39 pm
అస్సాంలోని గౌహతిలో ఒక భారీ ఝుమోర్ కార్యక్రమం అయిన ‘ఝుమోర్ బినందిని 2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఆహూతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమంలో ఎటు చూసినా శక్తి, ఉత్సాహం, ఉత్సుకత వెల్లివిరుస్తున్నాయన్నారు. ఝుమోయిర్ కళాకారులు వారు పనిచేసే తేయాకు తోటల్లోని సుగంధాన్ని, శోభను తమ నృత్యంలో ఆవిష్కరించారంటూ ఆయన ప్రశంసలను కురిపించారు. ఝూమోయిర్‌తోనూ, తేయాకు తోటల సంస్కృతితోనూ ప్రజలకొక విశిష్ట అనుబంధం ఉన్నట్లే ఈ విషయంలో తాను కూడా ఇదే తరహా అనుభూతిని పొందానని ఆయన అభివర్ణించారు. ఇంత పెద్ద సంఖ్యలో కళాకారులు ఈ రోజు ప్రదర్శించిన ఝూమోయిర్ నృత్యం ఒక రికార్డును సృష్టించగలదని కూడా ఆయన అన్నారు. 2023లో తాను అస్సాంను సందర్శించినప్పుడు కూడా 11,000 మంది కళాకారులు బిహూ నృత్యం చేయగా అదొక రికార్డును సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. అది తాను మరచిపోలేని ఓ జ్ఞాపకమని చెబుతూ అలాంటి ఒక సమ్మోహక ప్రదర్శనను తిలకించడానికి తాను సంసిద్ధుడినై వచ్చినట్లు చెప్పారు. ఒక ఉజ్వల సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు అస్సాం ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ రోజు అస్సాంకూ, తేయాకు తోటల్లో పనిచేసేవారికి, వేడుకల్లో పాలుపంచుకొనే ఆదివాసీలకు గర్వించాల్సిన రోజు అని ఆయన అన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున అందరికీ ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు.బాగేశ్వర్ ధామ్ వైద్య, వైజ్ఞానిక పరిశోధన సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగం
February 23rd, 06:11 pm
కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి భాయ్ మోహన్ యాదవ్ గారూ, జగద్గురు పూజ్య రామభద్రాచార్య గారూ, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారూ, సాధ్వి రితంబర గారూ, స్వామి చిదానంద సరస్వతి గారూ, మహంత్ శ్రీ బాలక్ యోగేశ్చర దాస్ గారూ, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారూ, ఇతర ప్రముఖులూ... ప్రియమైన సోదరీ సోదరులారా!బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
February 23rd, 04:25 pm
బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా గఢా గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ సమయంలోనే రెండో సారి బుందేల్‌ఖండ్‌కు రావడం తనకు దక్కిన సౌభాగ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కేంద్రం బాగేశ్వర్ ధామ్ త్వరలోనే ఆరోగ్య కేంద్రంగా కూడా రూపుదాల్చుతుందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తారని, మొదటి దశలో 100 పడకల సదుపాయం అందివస్తుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర కార్యానికిగాను శ్రీ ధీరేంద్ర శాస్త్రిని ఆయన అభినందిస్తూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.We launched the SVAMITVA Yojana to map houses and lands using drones, ensuring property ownership in villages: PM
January 18th, 06:04 pm
PM Modi distributed over 65 lakh property cards under the SVAMITVA Scheme to property owners across more than 50,000 villages in over 230 districts across 10 states and 2 Union Territories. Reflecting on the scheme's inception five years ago, he emphasised its mission to ensure rural residents receive their rightful property documents. He expressed that the government remains committed to realising Gram Swaraj at the grassroots level.స్వామిత్వ లబ్దిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
January 18th, 05:33 pm
మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన లబ్ధిదారుడు శ్రీ మనోహర్ మేవాడతో సంభాషించిన ప్రధానమంత్రి, పథకానికి సంబంధించి తన అనుభవాన్ని పంచుకోవాలని కోరారు. ఆస్తి పత్రాలతో రుణం పొందడం గురించి అలాగే తన జీవితంలో దానివల్ల కలిగిన ప్రయోజనాలను శ్రీ మనోహర్‌ను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. తన డెయిరీ ఫామ్ కోసం 10 లక్షల రుణం తీసుకున్నాననీ, అది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంతగానో సహాయపడిందని శ్రీ మనోహర్ వివరించారు. తాను, తన పిల్లలు, తన భార్య కూడా డెయిరీ ఫామ్‌లో పనిచేయడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఆస్తి పత్రాలు ఉండటం వల్లే బ్యాంకు రుణం పొందడం సులభతరమైందని శ్రీ మనోహర్ సంతోషంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవితాల్లో కష్టాలు తగ్గాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వామిత్వ యోజన లక్షలాది కుటుంబాల ఆదాయాన్ని పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు గర్వంగా తల ఎత్తుకుని, జీవితంలో సుఖాన్ని అనుభవించేలా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. స్వామిత్వ యోజనను ఈ దార్శనికతకు కొనసాగింపుగా ప్రధానమంత్రి అభివర్ణించారు.