సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
May 11th, 12:28 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పునర్నిర్మాణం తర్వాత సోమనాథ్ ఆలయంలోకి భక్తులను అనుమతించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ సందర్శనకు వెళ్లటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.గుజరాత్‌లోని ప్రభాస్ పటన్ వద్ద జరిగిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగం
May 11th, 10:20 am
గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణానంతర ప్రతిష్ఠాపనోత్సవానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ అమృత మహోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 11th, 10:15 am
గుజరాత్‌లోని సోమనాథ ఆలయ పునరుద్ధరణానంతర ప్రతిష్ఠాపనోత్సవానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన అమృత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
April 26th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం సుమారు 5 గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.పశ్చిమ బెంగాల్ అవినీతి, “కట్ మనీ” సంస్కృతితో ఇంకా సతమతమవుతూనే ఉంది: మేదినీపూర్‌లో ప్రధాని మోదీ
April 19th, 11:30 am
మేదినీపూర్ ర్యాలీలో, అవినీతి, నిరుద్యోగం, వలసలను ఉదహరిస్తూ, భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధికి, టీఎంసీ పాలనలో బెంగాల్ ఎదుర్కొంటున్న స్తబ్దతకు ప్రధాని మోదీ విరుద్ధంగా చూపించారు. “దోపిడీ రహిత బెంగాల్” కోసం పిలుపునిస్తూ, ఆయన మార్పు ఆవశ్యకతను నొక్కి చెప్పారు - “పల్టానో డోర్కర్!” (డబ్బును వెనక్కి నెట్టండి!). ఆయన బెంగాల్‌లో ఇంకా వెలుగులోకి రాని మత్స్య సంపద సామర్థ్యాన్ని కూడా హైలైట్ చేస్తూ, “నీలి విప్లవం” తీసుకువస్తామని వాగ్దానం చేశారు.దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు మండీల నుంచి టీఎంసీ సిండికేట్లను తొలగిస్తాం: పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో ప్రధాని మోదీ
April 19th, 11:20 am
ఝార్‌గ్రామ్ ర్యాలీలో ప్రధాని మోదీ, చొరబాట్లు మరియు బెంగాల్ గుర్తింపుపై వాటి ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు. అధిక విద్యుత్ బిల్లులు, కొరత సమస్యలను కూడా ఆయన ప్రస్తావిస్తూ, పీఎం సూర్య ఘర్ పథకం కింద స్వచ్ఛమైన, సరసమైన ఇంధనం ద్వారా ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులు, గిరిజనులు, యువతకు అధిక కనీస మద్దతు ధర (MSP), విస్తరించిన సంక్షేమ పథకాలు, మెరుగైన పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, సిండికేట్ నియంత్రణ నుంచి విముక్తి వంటి కీలక హామీలను ఆయన వివరించారు.వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను టీఎంసీ అడ్డుకుంటోంది: పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో ప్రధాని మోదీ
April 19th, 11:10 am
నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులు, మండీలు, కోల్డ్ స్టోరేజీలపై సిండికేట్ల నియంత్రణ కారణంగా రైతులు పడుతున్న కష్టాలను పురూలియా ర్యాలీలో ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. మెరుగైన కనీస మద్దతు ధర (MSP), విస్తరించిన పీఎం-కిసాన్ ప్రయోజనాలు, సాగునీటి మద్దతు, పీఎం-కుసుమ్, పంటల బీమా సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీలు నమ్మకంతో నడుస్తాయి, భయంతో కాదు అని ఆయన పునరుద్ఘాటించారు.పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్, పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్‌లలో ప్రధాని మోదీ ఉత్సాహభరితమైన ర్యాలీలు
April 19th, 11:00 am
బిష్ణుపూర్, పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్‌లలో జరిగిన భారీ, ఉత్సాహభరితమైన బహిరంగ సభలలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో మహిళా సాధికారత, అభివృద్ధి, నిర్ణయాత్మక మార్పుపై బలమైన, స్థిరమైన సందేశాన్ని అందించారు.నేడు బీజేపీ సుపరిపాలనకు మరియు ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తికి కూడా లబ్దిని అందించడానికి (last-mile delivery) నిదర్శనంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ
April 06th, 12:30 pm
పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తరతరాల కార్యకర్తలకు, వారి అంకితభావానికి, త్యాగానికి, అచంచలమైన నిబద్ధతకు నివాళులర్పించారు. బీజేపీకి అధికారం గానీ, వనరులు గానీ లేని తొలినాళ్లలో, ప్రజలతో మమేకమవ్వడానికి కార్యకర్తలు అవిశ్రాంతంగా పర్యటించిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ, రాజకీయ ఒంటరితనం, హింస వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత్ ఉజ్వల భవిష్యత్తుపై వారికున్న నమ్మకమే వారిని ముందుకు నడిపించిందని ఆయన పునరుద్ఘాటించారు.బీజేపీ స్థాపన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
April 06th, 12:00 pm
పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తరతరాల కార్యకర్తలకు, వారి అంకితభావానికి, త్యాగానికి, అచంచలమైన నిబద్ధతకు నివాళులర్పించారు. బీజేపీకి అధికారం గానీ, వనరులు గానీ లేని తొలినాళ్లలో, ప్రజలతో మమేకమవ్వడానికి కార్యకర్తలు అవిశ్రాంతంగా పర్యటించిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ, రాజకీయ ఒంటరితనం, హింస వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత్ ఉజ్వల భవిష్యత్తుపై వారికున్న నమ్మకమే వారిని ముందుకు నడిపించిందని ఆయన పునరుద్ఘాటించారు.శ్రీ రామ జన్మభూమి ఆలయంలో సూర్య తిలకాన్ని వీక్షించిన ప్రధానమంత్రి
March 27th, 05:02 pm
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో ఈ రోజు సూర్య తిలకం ఘట్టాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీక్షించారు. ‘‘శ్రీ రామ ప్రభువు ఆశీర్వాదాలు మన అందరికీ లభించాలని నేను కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ తెలిపారు.రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
March 26th, 12:11 pm
పవిత్ర రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, తపస్సు, నిగ్రహానికి మారుపేరైన మర్యాద పురుషోత్తముడు రాముని జీవితం.. ఎలాంటి పరిస్థితినైనా స్థైర్యం, సంకల్పంతో ఎదుర్కొనే స్ఫూర్తిని ప్రజలకు ఇస్తుందని శ్రీ మోదీ చెప్పారు.మొదటి ఓటు నుండి స్టార్టప్ ఇండియా వరకు, మన్ కీ బాత్‌లో భారతదేశ యువత పట్ల ప్రధానమంత్రి మోదీ ఉత్సాహం
January 25th, 11:30 am
ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు జరిగిన మొదటి మన్ కీ బాత్‌లో, ప్రధానమంత్రి మోదీ ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. స్టార్టప్‌లు, నీటి సంరక్షణ, నాణ్యత, సంస్కృతి & పండుగలు మరియు పరిశుభ్రత వంటి కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు పాల్గొనే రాబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రధాని హైలైట్ చేశారు.అనువాదం: గుజరాత్‌లో జరిగిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'లో ప్రధానమంత్రి ప్రసంగం
January 11th, 12:00 pm
ప్రజాదరణ కలిగిన గౌరవ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, ఉత్సాహవంతుడైన యువ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులు జితుభాయ్ వాఘాని, అర్జున్‌భాయ్ మోద్వాడియా, డాక్టర్ ప్రద్యుమ్న వాజా, కౌశిక్ భాయ్ వేకారియా.. పార్లమెంటు సభ్యుడు రాజేష్‌భాయ్, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా.. ఈ రోజు దేశ నలుమూలలకు చెందిన లక్షలాది మంది ప్రజలు మనతో అనుసంధానమై ఉన్నారు.. వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘సోమనాథుడికి విజయం కలుగుగాక’!!గుజరాత్‌లోని సోమనాథ్‌లో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 11th, 11:41 am
గుజరాత్‌లోని సోమనాథ్‌లో ఈ రోజు నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమయం అసాధారణమైనది... ఈ వాతావరణం అసాధారణమైనది... ఈ వేడుక అసాధారణమైనది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒక వైపు స్వయంగా మహాదేవుడు... మరోవైపు సూర్యకిరణాలు, మంత్రాల ప్రతిధ్వని, ఉప్పొంగుతున్న భక్తితో కూడిన సముద్రపు అలలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో సోమనాథ్... భక్తులందరి ఉనికితో ఈ సందర్భాన్ని మరింత దివ్యమైనదిగా, గొప్పగా మారుస్తోందని ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా తనకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో చురుగ్గా సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 72 గంటల పాటు నిరంతరాయంగా ఓంకారం జపించడం... 72 గంటల పాటు మంత్ర పఠనం చేయడం అద్భుతమని ఆయన పేర్కొన్నారు. నిన్న సాయంత్రం వెయ్యి డ్రోన్లతో... వేద గురుకులాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు నిర్వహించిన అద్భుత ప్రదర్శన సోమనాథుని వెయ్యి సంవత్సరాల గాథను ఎంతో చక్కగా వివరించిందన్నారు. 108 అశ్వాలతో సాగిన 'శౌర్య యాత్ర' ఈ రోజు ఆలయానికి చేరుకుందని ఆయన తెలిపారు. మంత్రాలు, భజనలతో భక్తులందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ ప్రదర్శన మాటలకు అతీతమని... కాలం మాత్రమే ఈ అనుభవాన్ని సంగ్రహించగలదని ఆయన వివరించారు. ఈ వేడుక దర్పం, గౌరవం, హుందాతనం, జ్ఞానం, గొప్పతనం, వారసత్వం, ఆధ్యాత్మికత, సాక్షాత్కారం, అనుభవం, ఆనందం, సాన్నిహిత్యాల కలయికగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అన్నింటికీ మించి ఇది భగవాన్ మహాదేవుని ఆశీర్వాదాలను కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ రెండో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 31st, 01:51 pm
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగి రెండేళ్లు పూర్తయిన శుభ సందర్భంగా దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building: PM Modi in Lucknow
December 25th, 06:16 pm
PM Modi inaugurated the Rashtra Prerna Sthal in Lucknow, Uttar Pradesh today. He paid respectful homage, offering salutations to Mahamana Malaviya ji, Atal ji, and Maharaja Bijli Pasi. He remarked that Atal ji and Malaviya ji dedicated their lives to safeguarding India’s identity, unity and pride. Quoting lines of Atal ji, the PM emphasized that Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని’ ప్రారంభించిన ప్రధానమంత్రి
December 25th, 05:23 pm
మాజీ ప్రధాని అటల్ బిహారీ శ్రీ వాజ్‌పేయి 101వ జయంతి నేపథ్యంలో ఆయన జీవితం, ఆదర్శాల గౌరవపూర్వక సంస్మరణ దిశగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మించిన ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని (రాష్ట్ర ప్రేరణా స్థల్)ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- లక్నో నగరం ఇవాళ ఓ నవ్య స్ఫూర్తికి సాక్షిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. అలాగే, దేశ ప్రజలతోపాటు యావత్ ప్రపంచంలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో లక్షలాది కుటుంబాలు నేడు ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నింపాలన్నదే ప్రజానీకం సమష్టి ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు.శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 03:35 pm
ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
November 28th, 03:30 pm
“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.