ప్రధానమంత్రికి స్లొవేక్ రిపబ్లిక్ అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్’’ ప్రదానం

June 15th, 11:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్లొవేకియా అత్యున్నత జాతీయ పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్ను ఆ దేశాధ్యక్షులు శ్రీ పీటర్ పెల్లెగ్రినీ ప్రదానం చేశారు.

నార్వే అత్యున్నత ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని అందుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 18th, 07:35 pm

నార్వే ఐదవ రాజు కింగ్ హెరాల్డ్ ఈ రోజు ఓస్లోలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇది విదేశీ ప్రభుత్వ అధినేతలకు నార్వే దేశం అందించే అత్యున్నత గౌరవం. నార్వే దేశ ప్రయోజనాలకు, మానవాళికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.

స్వీడన్ అత్యున్నత పురస్కారం - రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను అందుకున్న ప్రధానమంత్రి

May 17th, 11:13 pm

స్వీడన్ లో18వ శతాబ్దంలో ఏర్పాటైన దేశ అత్యంత పురాతన, విశిష్ట పురస్కారాలలో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు. గాథెన్‌బర్గ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, స్వీడన్ యువరాణి క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అసాధారణ ప్రజా సేవకు, స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అందించిన విశేష కృషికి గుర్తింపుగా విదేశీ ప్రభుత్వ అధినేతలకు స్వీడన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తుంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బ్రెజిల్‌‌లో అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’’ ప్రదానం

July 09th, 12:58 am

బ్రెజిల్‌‌లో అత్యున్నత జాతీయ పురస్కారం అయిన ‘‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’’ అవార్డుతో ఆ దేశ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు భారత ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని సత్కరించారు.

సైప్రస్ లో ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III’ స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 16th, 01:35 pm

ఇది ఒక్క నరేంద్ర మోదీకి ఇచ్చిన సత్కారం కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు బహూకరించిన సన్మానం. ఇది వారి బలానికీ, ఆకాంక్షలకూ గుర్తింపు. ఇది మా ఘన సాంస్కృతిక వారసత్వానికీ, ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే మా దర్శనానికీ గుర్తింపు.

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III ను అందుకున్న ప్రధానమంత్రి

June 16th, 01:33 pm

సైప్రస్‌లో ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’’ను ఆ దేశ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టొడౌలిడెస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు.

ఏప్రిల్ 21న పౌర సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి ప్రజా పరిపాలనలో విశిష్ట సేవలకుగాను ప్రధానమంత్రి అవార్డులను ప్రదానం చేయనున్న శ్రీ నరేంద్ర మోదీ

April 19th, 01:16 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17వ జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రజా పరిపాలనలో విశిష్ట సేవలకు గాను ప్రధానమంత్రి అవార్డులను ఆయన ప్రదానం చేయనున్నారు.

PM Modi expresses gratitude for the ‘Honorary Order of Freedom of Barbados’ Award

March 07th, 10:02 am

The Prime Minister, Shri Narendra Modi has expressed his gratitude to the Government and the people of Barbados for the ‘Honorary Order of Freedom of Barbados’ Award. Shri Modi has dedicated this honour to the 1.4 billion Indians and to the close relations between India and Barbados.

జాతీయ పంచాయతీ పురస్కార గ్రహీతల ను అభినందించిన ప్రధాన మంత్రి

April 18th, 09:51 am

జాతీయ పంచాయతీ పురస్కార గ్రహీతల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

సంసద్ రత్న అవార్డులు- 2023 తో సమ్మానితులు కానున్న తన తోటి ఎంపి లకు అభినందనల నుతెలియ జేసిన ప్రధాన మంత్రి

February 22nd, 12:47 pm

సంసద్ రత్న అవార్డులు- 2023 తో సన్మానితులు కానున్న తన తోటి ఎంపి లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

పద్మ అవార్డు గ్రహీత శ్రీ బీరేన్ కుమార్ బసక్ తనకిచ్చిన బహుమతిపై ప్రధానమంత్రి ధన్యవాదాలు

November 13th, 09:08 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ చేనేత కళాకారుడు, పద్మ అవార్డు గ్రహీత శ్రీ బీరేన్ కుమార్ బ‌స‌క్‌తో త‌న సంభాష‌ణ‌ను గుర్తు చేసుకుంటూ ఆయన తనకిచ్చిన బహుమతికి ధన్యవాదాలు తెలిపారు.

హెల్థ్ గిరి అవార్డ్ స్ 21విజేతల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

October 02nd, 06:17 pm

హెల్థ్ గిరి అవార్డ్ స్ 21 విజేతల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఖేల్ రత్న అవార్డు ను ఇక మీదట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుంది: ప్రధాన మంత్రి

August 06th, 02:15 pm

ఖేల్ రత్న అవార్డు ను మేజర్ ధ్యాన్ చంద్ పేరు తో వ్యవహారం లోకి తీసుకు రావాలని భారతదేశం వ్యాప్తంగా పౌరుల వద్ద నుంచి తనకు ఎన్నో అభ్యర్థన లు వస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పౌరుల ఈ భావనల ను గౌరవిస్తూ ఖేల్ రత్న అవార్డు ను ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుందని ఆయన చెప్పారు.

ప్రజల పద్మ పురస్కారాల కోసం ప్రేరణమూర్తుల ను నామనిర్దేశం చేయాలని పౌరులకు విజ్ఞప్తి చేసిన ప్ర‌ధాన మంత్రి

July 11th, 11:40 am

క్షేత్ర స్థాయి లో ప్రశంసాయోగ్యమైన కృషి ని చేస్తున్నటువంటి, ప్రజల కు అంతగా తెలియనటువంటి వారి ని ప్రజా పద్మ పురస్కారాల కోసం నామనిర్దేశం చేయవలసిందంటూ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నామినేశన్ లను సెప్టెంబర్ 15 వరకు సమర్పించవచ్చు.

‘సెరావీక్‌’ కార్యక్రమంలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం

March 05th, 06:59 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ సిఇఆర్ ఎ వారోత్స‌వం 2021 సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా కీల‌కోప‌న్యాసంచేశారు. ప్ర‌ధాన‌మంత్రికి సిఇఆర్ఎ వారోత్స‌వ అంత‌ర్జాతీయ ఇంధ‌న‌, ప‌ర్యావ‌ర‌ణ నాయ‌క‌త్వ అవార్డు ను అంద‌జేశారు. తాను విన‌మ్ర‌త‌తో ఈ అవార్డును అంగీక‌రిస్తున్నాన‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుత‌మైన మాతృభూమికి చెందిన ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు.అలాగే ఈ అవార్డును భార‌త‌దేశ అద్భుత సంప్ర‌దాయాల‌కు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో శ‌తాబ్దాలుగా భార‌తీయులు నాయ‌క‌త్వ స్థానంలో ఉన్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.మ‌న సంస్కృతిలో ప్ర‌కృతి,దైవ‌త్వం స‌న్నిహిత అనుబంధం క‌లిగిన‌వ‌ని ఆయ‌న అన్నారు.

సిఇఆర్ఎ వారోత్స‌వం 2021లో కీల‌క‌ప్ర‌సంగం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

March 05th, 06:56 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ సిఇఆర్ ఎ వారోత్స‌వం 2021 సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా కీల‌కోప‌న్యాసంచేశారు. ప్ర‌ధాన‌మంత్రికి సిఇఆర్ఎ వారోత్స‌వ అంత‌ర్జాతీయ ఇంధ‌న‌, ప‌ర్యావ‌ర‌ణ నాయ‌క‌త్వ అవార్డు ను అంద‌జేశారు. తాను విన‌మ్ర‌త‌తో ఈ అవార్డును అంగీక‌రిస్తున్నాన‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుత‌మైన మాతృభూమికి చెందిన ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు.అలాగే ఈ అవార్డును భార‌త‌దేశ అద్భుత సంప్ర‌దాయాల‌కు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో శ‌తాబ్దాలుగా భార‌తీయులు నాయ‌క‌త్వ స్థానంలో ఉన్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.మ‌న సంస్కృతిలో ప్ర‌కృతి,దైవ‌త్వం స‌న్నిహిత అనుబంధం క‌లిగిన‌వ‌ని ఆయ‌న అన్నారు.

సిఇఆర్ఎ వీక్ గ్లోబ‌ల్ ఎన‌ర్జీ ఎండ్ ఎన్‌వైర‌న్‌మెంట్ లీడ‌ర్ ‌శిప్ అవార్డు ను స్వీక‌రించ‌నున్న ప్ర‌ధాన మంత్రి; ఆయ‌నఈ నెల 5న ‘సిఇఆర్ఎ వీక్ 2021’ లో కీల‌కోప‌న్యాసాన్ని ఇవ్వ‌నున్నారు

March 04th, 06:31 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంబ్రిడ్జ్ ఎన‌ర్జీ రిస‌ర్చ్ అసోసియేట్స్‌ వీక్ (సిఇఆర్ఎ వీక్) తాలూకు గ్లోబ‌ల్ ఎన‌ర్జీ ఎండ్ ఎన్‌వైర‌న్‌మెంట్ లీడ‌ర్ శిప్ అవార్డు ను స్వీక‌రించ‌నున్నారు. సిఇఆర్ఎ వీక్ 2021 సమావేశాల లో ఆయన ఈ నెల 5న రాత్రి 7 గంట‌ల స‌మ‌యం లో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా కీల‌కోప‌న్యాసం చేయ‌నున్నారు.

ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాల గ్రహీతలతో ప్రధాని సంభాషణ మూల పాఠం

January 25th, 12:08 pm

‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎమ్ఆర్‌బిపి)’ గ్ర‌హీత‌ల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో మ‌హిళ‌లు & బాల‌ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మతి స్మృతి జుబిన్ ఇరానీ కూడా హాజరయ్యారు.

‘రాష్ట్రీయ బాల పుర‌స్కార్‌, 2021’ గ్ర‌హీత‌ల‌ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

January 25th, 12:00 pm

‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎమ్ఆర్‌బిపి)’ గ్ర‌హీత‌ల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో మ‌హిళ‌లు & బాల‌ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మతి స్మృతి జుబిన్ ఇరానీ కూడా హాజరయ్యారు.

జనవరి 25వ తేదీన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కర్ అవార్డు గ్రహీతలతో ముచ్చటించనున్న - ప్రధానమంత్రి

January 24th, 04:35 pm

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పి.ఎం.ఆర్.బి.పి) అవార్డు గ్రహీతలతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 జనవరి, 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంభాషించనున్నారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు.