వ్యక్తిగత అత్యుత్తమ త్రో సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి అభినందన

May 17th, 09:10 am

దోహా డైమండ్ లీగ్ 2025 లో 90 మీటర్ల మార్కును అధిగమించి, వ్యక్తిగత అత్యుత్తమ త్రో సాధించినందుకు నీరజ్ చోప్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఇది చోప్రా అలుపెరగని అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచి ఫలితం అని శ్రీ మోదీ అన్నారు.

7వ ఖేలో ఇండియా యువజన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

May 04th, 08:16 pm

బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, మన్సుఖ్ భాయ్, సోదరి రక్షా ఖడ్సే, శ్రీ రామ్ నాథ్ ఠాకూర్ జీ, బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి జీ మరియు విజయ్ కుమార్ సిన్హా జీ, హాజరైన ఇతర విశిష్ట అతిథులు, క్రీడాకారులు, కోచ్ లు, ఇతర సిబ్బంది నా ప్రియమైన యువ స్నేహితులు!

7వ ఖేలో ఇండియా యువజన క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

May 04th, 08:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 7వ ఖేలో ఇండియా యువజన క్రీడలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, శిక్షకులు, క్రీడా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు అసమాన ప్రతిభ, దృఢ సంకల్పం ప్రదర్శించారని ఆయన అభినందించారు. వారి అంకితభావం, కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- భారతీయ క్రీడా స్ఫూర్తిని నిలువెత్తున నిలపడంలో వారి పాత్రను ప్రశంసించారు. క్రీడాకారుల అద్భుత నైపుణ్యం, నిబద్ధతను స్పష్టం చేస్తూ- క్రీడలపై వారి మక్కువ, ప్రతిభకు పదును పెట్టుకోవడంలో వారి అకుంఠిత దీక్ష దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులోనూ వారి కఠోర శ్రమ నిరంతరం ఫలించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రిని కలిసిన ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి

April 15th, 09:54 am

ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి నిన్న యమునానగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిశారు. యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయడంలో ఆమె కృషిని ప్రధాని ప్రశంసించారు.

5వ ఖేలో ఇండియా వింటర్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధాని అభినందనలు

January 23rd, 07:10 pm

‘‘5వ ఖేలో ఇండియా వింటర్ క్రీడలు 2025లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు! ఈ పోటీలు యువ ప్రతిభను పోత్సహిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ క్రీడల ద్వారా క్రీడాస్ఫూర్తి వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.@kheloindia”.

ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందన

January 19th, 11:06 pm

ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. వారి అకుంఠిత దీక్ష, అంకిత భావం ప్రశంసనీయమైనవని వ్యాఖ్యానించారు.

ఖో ఖో ప్రపంచ కప్ విజయంపై భారత మహిళల జట్టుకు ప్రధాని అభినందన

January 19th, 09:21 pm

తొలిసారిగా ఖో ఖో ప్రపంచ కప్ ను గెలుచుకున్న భారత మహిళల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధానమంత్రిని కలిసిన చెస్ ఛాంపియన్ గుకేశ్. డి

December 28th, 06:34 pm

చెస్ ఛాంపియన్ గుకేశ్. డి ఆదివారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. గుకేశ్ దృఢ సంకల్పం, అంకితభావాలను శ్రీ మోదీ ప్రశంసించారు. ఆయన సంకల్పం స్ఫూర్తిదాయకమన్నారు.

పురుషుల జావెలిన్ త్రో పోటీలో రజత పతకాన్ని

September 08th, 08:33 am

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్ 41 పోటీలో వెండి పతకాన్ని క్రీడాకారుడు

మహిళల 200 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన

September 08th, 08:31 am

పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 200 మీటర్ల టి12 పరుగు పోటీలో కాంస్య పతకాన్ని క్రీడాకారిణి సిమ్రన్ శర్మ గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజు అభినందనలు తెలిపారు.

పురుషుల షాట్ పుట్ లో కాంస్య పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమాను అభినందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 07th, 09:04 am

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల షాట్ పుట్ ఎఫ్57 పోటీలో కంచు పతకాన్ని క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమా గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు న అభినందించారు.

హై జంప్ పోటీలో బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 06th, 05:22 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పురుషుల హైజంప్ టి64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కాంస్య పతకాన్ని గెలిచిన జూడో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 05th, 10:26 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల 60 కిలో గ్రాముల జె1 పోటీలో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కంచు పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ఆయనకు అభినందనలను తెలియజేశారు.

పురుషుల క్లబ్ త్రో పోటీలో రజత పతకాన్ని గెలిచిన ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబినందనలు

September 05th, 08:05 am

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 (దుడ్డుకర్ర ను విసిరే) పోటీలో వెండి పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. శ్రీ ప్రణవ్ సూర్మా పట్టుదలను, దృఢ దీక్షను ప్రధాని ప్రశంసించారు.

కాంస్య విజేత మరియప్పన్ తంగవేలుకు ప్రధాని అభినందనలు

September 04th, 10:31 am

పారిస్ లో జరుగుతున్నపారాలింపిక్ క్రీడల్లో పురుషుల హైజంప్ టీ63 విభాగంలో కాంస్యం సాధించిన క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అభినందించారు.

పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజికి ప్రధాని అభినందనలు

September 04th, 06:40 am

పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 400మీ.ల టీ20 విభాగంలో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.

పారిస్ పారాలింపిక్స్ 2024: ప్రీతి పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 02nd, 10:50 am

ట్రాక్ అండ్ పీల్డ్ ఈవెంట్స్ లో క్రీడాకారిణి ప్రీతి పాల్ ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో రెండో పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజున అభినందనలు తెలిపారు.

పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ నిషాద్ కుమార్ కు ప్రధాన మంత్రి అభినందనలు

September 02nd, 10:50 am

పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ నిషాద్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ క్రీడాకారిణి ప్రీతి పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

August 30th, 06:42 pm

పారిస్ పారాలింపిక్స్ 2024 లో 100 మీటర్ల టి35 పోటీ లో భారతీయ క్రీడాకారిణి ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనలను తెలియజేశారు.

‘పారిస్ పారాలింపిక్స్ 2024’ లో మన దేశ క్రీడాకారుల బృందం రాణించాలన్నదే 140 కోట్ల మంది భారతీయుల కోరిక: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 28th, 09:47 pm

‘పారిస్ పారాలింపిక్స్ 2024’లో పాల్గొననున్న భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల బృందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని వారి ధైర్య సాహసాలను, దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తూ వారు విజయం సాధించాలని భారతదేశంలో 140 కోట్ల మంది పౌరులు పూర్తి మద్దతును వ్యక్తం చేస్తున్నారని అన్నారు.