కెన్ – బెత్వా నదీ అనుసంధాన జాతీయ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా మధ్యప్రదేశ్ లోని కజురహోలో ప్రధాని ప్రసంగం

December 25th, 01:00 pm

వీరభూమి అయిన బుందేల్ ఖండ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవనీయ మధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, కార్యశీలుడైన ముఖ్యమంత్రి- సోదరుడు మోహన్ యాదవ్, కేంద్ర మంత్రులు సోదరులు శివరాజ్ సింగ్, వీరేంద్ర కుమార్, సీఆర్ పాటిల్, ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవడా, రాజేంద్ర శుక్లా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశిష్ట అతిథులు, పూజనీయ సాధుసంతులు, ప్రియమైన మధ్రప్రదేశ్ సోదరీ సోదరులు... అందరికీ నా శుభాకాంక్షలు.

మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కెన్-బెత్వా నదుల అనుసంధాన జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన

December 25th, 12:30 pm

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన వారిని ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి డా. మోహన్ యాదవ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది కాలంలో వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పథకాలను అమలు చేయడంతో పాటు, అభివృద్ధి కార్య్రమాలు వేగం పుంజుకున్నాయని ఆయన అన్నారు. చరిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు, దౌధన్ డ్యామ్‌కు, మధ్యప్రదేశ్‌లో మొదటి సౌర విద్యుత్ ప్లాంట్ అయిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

డిసెంబర్ 25న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా కెన్-బెత్వా నదుల జాతీయ అనుసంధాన పథకానికి ప్రధాని శంకుస్థాపన

December 24th, 11:46 am

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధానమ్రంతి శ్రీ నరేంద్రమోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గం.లకు ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు.