కర్ణాటకలోని బెంగళూరులో వివిధ మెట్రో ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

August 10th, 01:30 pm

కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారూ, కేంద్రంలోని నా సహచరులు మనోహర్ లాల్ ఖట్టర్ గారూ, హెచ్ డీ కుమారస్వామి గారూ, అశ్విని వైష్ణవ్ గారూ, వి. సోమన్న గారూ, శోభ గారూ, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారూ, కర్ణాటక మంత్రి బి. సురేశ్ గారూ, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ గారూ, ఎంపీ తేజస్వి సూర్య గారూ, డాక్టర్ మంజునాథ్ గారూ, ఎమ్మెల్యే విజయేంద్ర యడియూరప్ప గారూ, కర్ణాటక సోదర సోదరీమణులారా...

కర్ణాటకలోని బెంగళూరు లో సుమారు రూ.22,800 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల ప్రారంభం...శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

August 10th, 01:05 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని బెంగళూరులో సుమారు రూ.7,160 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో యెల్లో లైన్‌ను ప్రారంభించారు. మరోపక్క రూ.15,610 కోట్లకు పైగా విలువైన బెంగళూరు మెట్రో 3వ దశ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌ నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కర్ణాటక నేలపై కాలుపెట్టగానే ఒక అనిర్వచనీయ అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కర్ణాటక సంస్కృతి వైభవం, ప్రజల స్నేహపూర్వకత, హృదయాన్ని హత్తుకునే కన్నడ భాష మాధుర్యాన్ని ప్రస్తావిస్తూ... శ్రీ మోదీ ముందుగా బెంగళూరుకు అధిష్ఠాన దేవత అన్నమ్మ తాయికి నమస్కరించారు. శతాబ్దాల క్రితం నాదప్రభు కెంపెగౌడ బెంగళూరు నగరానికి పునాది రాయి వేశారని గుర్తుచేసిన ప్రధానమంత్రి, సంప్రదాయాలతో మమేకమై అభివృద్ధి శిఖరాలను అధిరోహించే నగరాన్ని కెంపెగౌడ ఆనాడే ఊహించారని అన్నారు. “బెంగళూరు ఎల్లప్పుడూ ఆ భావాన్ని కొనసాగిస్తూ దాన్ని కాపాడుతూ వచ్చింది. ఈ రోజు ఆ కలను సాకారం చేసుకుంటోంది” అని ప్రధాని అన్నారు.

గాంధీనగర్‌లో ‘రెండు దశాబ్దాల గుజరాత్ పట్టణ ప్రగతి పథం’ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 27th, 11:30 am

ఈ వేదికనలంకరించిన గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన నా ప్రియ సోదరీసోదరులారా!

గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల ఉత్సవంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

May 27th, 11:09 am

గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల వేడుకనుద్దేశించి గాంధీనగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. పట్టణాభివృద్ధి సంవత్సరం- 2005కు ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణాభివృద్ధి సంవత్సరం-2025ను ఆయన ప్రారంభించారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో పర్యటన సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయ గర్జనలు, రెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలతో వెల్లివిరుస్తున్న దేశభక్తిని రెండు రోజులుగా ఆస్వాదిస్తున్నానన్నారు. ఈ కనువిందైన దృశ్యం ఒక్క గుజరాత్‌కే పరిమితం కాలేదనీ.. భారత్ నలుమూలలా, ప్రతి భారతీయుడి హృదయమూ ఇదే రకమైన భావనతో ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. “ఉగ్రవాదమనే కంటకాన్ని నిర్మూలించాలని సంకల్పించిన భారత్ దృఢ నిశ్చయంతో దానిని నెరవేర్చింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

అనువాదం: 17వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

April 21st, 11:30 am

నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ శక్తికాంత దాస్ గారు, డాక్టర్ సోమనాథన్ గారు, ఇతర సీనియర్ అధికారులు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్‌కు చెందిన సహచరులు, మహిళలు, పెద్దలు.. !

17వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 21st, 11:00 am

ఈ రోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్లనుద్దేశించి ప్రసంగించారు. ప్రజాపాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి శ్రేష్ఠత అవార్డులను ప్రదానం చేశారు. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ, సివిల్ స‌ర్వీసెస్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంవ‌త్సరం రాజ్యాంగం 75వ సంవత్సరాల వేడుకలు, స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ 150వ జ‌యంతి ఉత్సవాల సంద‌ర్భంగా సివిల్ సర్వీసెస్ డే మరింత విశిష్ఠతను సంతరించుకుందన్నారు. అలనాడు 1947 ఏప్రిల్ 21న సర్దార్ పటేల్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, సర్దార్ సివిల్ సర్వెంట్లను ‘భారత దేశ ఉక్కు కవచం’గా అభివర్ణించారని గుర్తు చేశారు. పూర్తి అంకితభావంతో పని చేస్తూ, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే పాలనా యంత్రాంగాన్ని పటేల్ కోరుకున్నారని చెప్పారు. వికసిత్‌ భారత్‌ ఆశయ సాకారంలో సర్దార్ పటేల్ ఆదర్శాలు దారిదీపాలంటూ, పటేల్ దార్శనికత, వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించారు.