అసోం దివస్ సందర్భంగా అస్సాం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 02nd, 03:56 pm
అసోమ్ దివస్ సందర్భంగా అస్సాంలోని సోదరీ సోదరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గదేవ్ ఛావొలుంగ్ సుకఫా దార్శనికతను సాకారం చేయాలన్న మన నిబద్ధతను పునరుద్ఘాటించాల్సిన సందర్భం ఈ రోజు అని శ్రీ మోదీ అన్నారు. ‘‘అస్సాం ప్రగతిని పెంపొందించడానికి గత కొన్నేళ్లుగా కేంద్రంలో, అస్సాంలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. మౌలిక ససదుపాయాలతో పాటు సామాజిక స్థితిగతులను కూడా మెరుగుపరచడంలో ఇదివరకు ఎరుగని అడుగులు పడ్డాయి. తాయి-అహోమ్ సంస్కృతితో పాటు తాయి భాషకు ప్రజాదరణను పెంచే దిశగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది అస్సాం యువతకు ఎంతో మేలు చేస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.