భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 03rd, 12:00 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 11:30 am
న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన 13వ సిఓపి వలస జీవజాల సమ్మేళనం ప్రారంభోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 17th, 01:37 pm
గాంధీ మహాత్ముని జన్మభూమి అయిన గాంధీనగర్ లో జరుగుతున్న వలస జాతుల 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీజ్ (సిఒపి) సమ్మేళనాని కి మిమ్ములను అందరి ని ఆహ్వానించడం నాకు సంతోషాన్ని ఇస్తోంది.గాంధీనగర్ లో వన్యజీవుల వలసజాతుల సంరక్షణ సంబంధిత 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీజ్ సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 17th, 12:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా గాంధీనగర్ లో వన్య జీవుల వలస జాతుల యొక్క సంరక్షణ సంబంధిత 13వ సిఓపి సమ్మేళనాన్ని ప్రారంభించారు.భారతదేశం-శ్రీలంక సంబంధాలన్ని బౌద్ధమతం నిరంతరం ప్రకాశింపజేస్తుంది: ప్రధాని
May 12th, 10:20 am
శ్రీలంకలో అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, బుద్ధుని బోధనలను పరిపాలన, సంస్కృతి, తత్త్వశాస్త్రంలో ఎంత లోతుగా వివరించారు. బుద్ధున్ని మరియు అతని బోధనలకు ప్రపంచానికి విలువైన బహుమతిని ఇచ్చినందుకు మన ప్రాంతం దీవించబడినది. అని ప్రధాని అన్నారు.ప్రతీ పౌరుడూ ముఖ్యుడే: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
April 30th, 11:32 am
తన మన్ కి బాత్ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎర్ర బుగ్గల కారణంగానే దేశంలో విఐపి సంస్కృతి వృద్ధి చెందింది. “ మనం నవభారతదేశం కోసం మాట్లాడుకున్నప్పుడు, విఐపి కంటే ఈఐపి ముఖ్యం”అని అన్నారు. ఈఐపి అంటే-“ఎవ్రీ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ (ప్రతీ పౌరుడూ ముఖ్యుడే)”. సెలవులను భాగ ఉపయోగించుకోవాలని, కొత్త అనుభవాలను, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని, కొత్త ప్రదేశాలను సందర్శించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన వేసవి గురించి, బిహెచ్ఐఎం యాప్ గురించి మరియు భారతదేశం వైవిధ్యం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.