నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 25th, 10:46 pm
నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నీతి ఆయోగ్ భారత విధాన రూపకల్పన వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తుందనీ... సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందిస్తూ, కీలక సంస్కరణలను ముందుకు నడిపిస్తూ, పౌరుల 'జీవన సౌలభ్యాన్ని' మెరుగుపరుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్థ అన్ని రంగాల్లో ఆవిష్కరణలకు, దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు ఒక చైతన్యవంతమైన వేదికగా సేవలందిస్తూనే ఉందన్నారు.ప్రధానితో శ్రీ అశోక్ కుమార్ లాహిరి భేటీ
April 25th, 10:43 pm
శ్రీ అశోక్ కుమార్ లాహిరి ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నియమితులైన ఆయనకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక శాస్త్రం, ప్రభుత్వ విధాన రంగాల్లో శ్రీ లాహిరి అపారమైన అనుభవం.. దేశ సంస్కరణల పథాన్ని మరింత పటిష్టం చేస్తుందనీ, వికసిత భారత్‌గా నిలవాలన్న దేశ సంకల్పాన్ని సాకారం చేయడంలోనూ దోహదపడుతుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.