న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్ 2025లో ప్రధాని ప్రసంగం

October 31st, 06:08 pm

న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.

అక్టోబరు 31న న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్యన్ శిఖరాగ్ర సమావేశం-2025.. పాల్గొననున్న ప్రధానమంత్రి

October 29th, 10:57 am

న్యూఢిల్లీలో అక్టోబరు 31న నిర్వహించనున్న అంతర్జాతీయ ఆర్యన్ శిఖరాగ్ర సమావేశం-2025 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యాహ్నం సుమారు 2 గంటల 45 నిమిషాలకు పాల్గొంటారు. సమాజ సేవలో ఆర్య సమాజ్ 150 సంవత్సరాలను పూర్తి చేసుకోవడాన్నీ, మహర్షి దయానంద్ సరస్వతి జీ 200వ జయంతినీ స్మరించుకొనేందుకు నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి ఉత్సవంలో ఈ శిఖరాగ్ర సమావేశానిది కీలక పాత్ర. ఈ కార్యక్రమంలో ఆహూతులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నివాళి

November 22nd, 03:09 am

గయానా లోని జార్జ్ టౌన్ లో ఉన్న ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గయానాలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో వారి కృషి, పాత్ర ప్రశంసనీయమని శ్రీ మోదీ కొనియాడారు. స్వామి దయానంద సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.