గువహటి సమీపంలోని బైహత చరియాలి నుంచి తేజ్‌పూర్ (15.11 కి.మీ మంగళ్‌దోయ్ బైపాస్ మినహా) వరకు జాతీయ రహదారి- 15 వెంబడి 4 వరుసల రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
August 06th, 04:12 pm
అస్సాంలో జాతీయ రహదారి-15 వెంబడి 135.871 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ప్రవేశ నియంత్రిత గువహటి - తేజ్‌పూర్ కారిడార్ అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘బిల్ట్- ఆపరేట్- ట్రాన్స్‌ఫర్ (బీవోటీ)’ టోల్ విధానంలో ఎన్‌హెచ్ (ఓ) కింద రూ. 8,970.20 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.Prime Minister reviews flood situation in Arunachal Pradesh and Nagaland with MPs from the two states
July 30th, 03:21 pm
The Prime Minister, Shri Narendra Modi, met Members of Parliament from Arunachal Pradesh and Nagaland and discussed the situation in the two states in the wake of the floods.అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో రూ.14,105.83 కోట్ల వ్యయంతో 1200 ఎండబ్ల్యూ సామర్థ్యం గల కలై-II జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
April 08th, 04:28 pm
అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో లోహిత్ నదిపై రూ.14,105.83 కోట్ల వ్యయంతో 1200 ఎండబ్ల్యూ సామర్థ్యం గల కలై-II జల విద్యుత్ ప్రాజెక్టు (హెచ్ఈపీ) నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 78 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా.Cabinet approves construction of 1720 MW Kamala Hydro Electric Project in Arunachal Pradesh
April 08th, 04:26 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi has approved investment of Rs.26,069.50 crore for construction of Kamala Hydro Electric Project (HEP) in Kamle, Kra Daadi & Kurung Kumey Districts of Arunachal Pradesh. The project will significantly improve infrastructure in the state and provide essential facilities, benefiting local communities.'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
March 29th, 11:30 am
ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
February 20th, 09:35 am
అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.మొదటి ఓటు నుండి స్టార్టప్ ఇండియా వరకు, మన్ కీ బాత్‌లో భారతదేశ యువత పట్ల ప్రధానమంత్రి మోదీ ఉత్సాహం
January 25th, 11:30 am
ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు జరిగిన మొదటి మన్ కీ బాత్‌లో, ప్రధానమంత్రి మోదీ ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. స్టార్టప్‌లు, నీటి సంరక్షణ, నాణ్యత, సంస్కృతి & పండుగలు మరియు పరిశుభ్రత వంటి కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు పాల్గొనే రాబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రధాని హైలైట్ చేశారు.అస్సాంలోని కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 18th, 11:30 am
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పబిత్రా మార్గరీటా, రాష్ట్ర మంత్రులు శ్రీ అతుల్ బోరా, శ్రీ చరణ్ బోరో, శ్రీ కృష్ణేందు పాల్, శ్రీ కేశబ్ మహంత, ఇతర ప్రముఖులు, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!అస్సాంలోని కలియాబోర్‌లో రూ.6,950 కోట్లకు పైగా విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
January 18th, 11:00 am
అస్సాంలోని కలియాబోర్‌లో రూ. 6,950 కోట్లకు పైగా విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు (జాతీయ రహదారి- 715లోని కలియాబోర్ - నుమాలీగఢ్ విభాగపు 4 వరుసల విస్తరణ)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై తనకు ఆశిస్సులందించిన ప్రజలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. వారికెంతో కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. రెండేళ్ల కిందట కాజీరంగాలో గడిపిన క్షణాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో అత్యంత విశేషమైన అనుభవాల్లో ఒకటిగా ఆ పర్యటన నిలిచిపోయిందన్నారు. మరోసారి కాజీరంగాను సందర్శిస్తున్న ఈ వేళ.. గత పర్యటన స్మృతులు మళ్లీ తన కళ్లెదుట కదలాడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాత్రి తాను కాజరంగా జాతీయోద్యానవనంలో బస చేశాననీ, మరునాడు ఉదయం ఏనుగు సఫారీ చేస్తూ ఈ ప్రాంత సౌందర్యాన్ని ఎంతో దగ్గరగా వీక్షించి అద్భుతానుభూతిని పొందాననీ ప్రధానమంత్రి శ్రీ మోదీ వివరించారు.అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
December 11th, 06:39 pm
ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.Prime Minister interacts with traders and entrepreneurs in Itanagar
September 22nd, 03:43 pm
PM Modi had an interaction with the traders and entrepreneurs in Itanagar, Arunachal Pradesh. Stating that they expressed their appreciation for the GST reforms and the launch of the GST Bachat Utsav, the PM highlighted how these initiatives will benefit key sectors. He emphasised quality standards and encouraged buying Made in India products.ఈటానగర్‌లో స్థానిక వ్యాపారులతోనూ, ఇతర వ్యాపారులతోనూ ప్రధానమంత్రి భేటీ
September 22nd, 03:39 pm
ఈటానగర్‌లో స్థానిక వ్యాపారులు, ఇతర వ్యాపారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వివిధ ఆకర్షణీయ ఉత్పాదనలను ప్రదర్శించారు. ‘‘జీఎస్టీ సంస్కరణల పట్ల వారు సంతోషాన్ని ప్రకటించారు. వారికి నేను ‘గర్వ్ సే కహో యే స్వదేశీ హై’ పోస్టర్లను అందజేశాను. వాటిని దుకాణాల్లో ప్రదర్శిస్తామని వారు ఉత్సాహంగా చెప్పారు’’ అని శ్రీ మోదీ తెలిపారు.అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 22nd, 11:36 am
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవ కే.టీ. పర్నాయక్ గారు, ప్రజాదరణతో.. చైతన్యవంతమైన పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు కిరణ్ రిజిజు గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, నా సహ పార్లమెంటు సభ్యులు నబమ్ రెబియా గారు, తపిర్ గావ్ గారు, అందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అరుణాచల్ ప్రదేశ్‌లోని నా ప్రియమైన సోదరీ సోదరులారా,అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
September 22nd, 11:00 am
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భగవాన్ డోన్యీ పోలోకు ప్రణామాలు అర్పించి, అందరిపై ఆయన ఆశీస్సులు ప్రసరించాలని ప్రార్థించారు.అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో రేపు (22 సెప్టెంబర్) ప్రధానమంత్రి పర్యటన
September 21st, 09:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో 5,100 కోట్ల రూపాయల పైగా విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. బహిరంగసభలో ప్రసంగిస్తారు.Bharat Ratna for Bhupen Da reflects our government's commitment to the North East: PM Modi in Guwahati, Assam
September 13th, 08:57 pm
PM Modi addressed the 100th birth anniversary of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam, calling it a remarkable day and a great privilege to be part of the celebrations. The PM shared, Bhupen Da, lovingly known as “Shudha Kantho,” gave voice to India’s unity, dreams and compassion of Mother India. “Bhupen Da’s entire life was dedicated to the nation’s goals,” PM Modi remarked, affirming the centenary year as a true tribute to his legacy.PM Modi addresses the 100th birth anniversary celebrations of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam
September 13th, 05:15 pm
PM Modi addressed the 100th birth anniversary of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam, calling it a remarkable day and a great privilege to be part of the celebrations. The PM shared, Bhupen Da, lovingly known as “Shudha Kantho,” gave voice to India’s unity, dreams and compassion of Mother India. “Bhupen Da’s entire life was dedicated to the nation’s goals,” PM Modi remarked, affirming the centenary year as a true tribute to his legacy.అరుణాచల్ ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో రూ. 8146.21 కోట్ల వ్యయంతో 700 మెగావాట్ల టాటో-II జల విద్యుత్ ప్రాజెక్టు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం
August 12th, 03:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. అరుణాచల్ ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో రూ. 8146.21 కోట్ల వ్యయంతో టాటో-II జల విద్యుత్ ప్రాజెక్టు (హెచ్‌ఈపీ) నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు 72 నెలల పడుతుందన్న అంచనా ఉంది.అరుణోదయ ఈశాన్య పెట్టుబడిదారుల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:00 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ సుకాంత మజుందార్, మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ హిమంత బిశ్వ శర్మ, శ్రీ పెమా ఖండు, శ్రీ మాణిక్ సాహా, శ్రీ కాన్రాడ్ సంగ్మా, శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, శ్రీ నైఫూ రియో, శ్రీ లాల్‌ధుమా సహా వివిధ పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు, సోదరీసోదరులందరికీ ప్రణామం!రైజింగ్ నార్త్ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు-2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 10:30 am
రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు- 2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రధానమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈశాన్య ప్రాంతంపై ఆత్మీయతను, పురోగతిపై అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతం గర్వకారణమన్నారు. ఈ మధ్యే భారత్ మండపంలో అష్టలక్ష్మీ మహోత్సవాన్ని నిర్వహించామని, నేటి కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడుల వేడుకను తలపిస్తోందని చెప్పారు. సదస్సుకు భారీగా పారిశ్రామికవేత్తలు హాజరవడంపై హర్షణీయమన్న ప్రధానమంత్రి.. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు గల అవకాశాలు వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని శ్రీ మోదీ అభినందించారు. ఈ ప్రాంత నిరంతర అభివృద్ధి, సంక్షేమాలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి.. నార్త్ఈస్ట్ రైజింగ్ సదస్సును అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.