ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి మృతి పట్ల ప్రధాని సంతాపం
July 14th, 03:40 pm
ప్రముఖ సినీతార బి. సరోజా దేవి మరణంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.ముంబయి ‘వేవ్స్ సమ్మిట్’లో ప్రధానమంత్రి ప్రసంగం
May 01st, 03:35 pm
వేవ్స్ సమ్మిట్ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ
May 01st, 11:15 am
మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ - వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు, రాయబారులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాకు చెందిన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, సృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతిని, సృజనాత్మకతను, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారు. అలాగే ఈ సదస్సు సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారు. అదే సమయంలో కళాకారులు, రూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.పద్మశ్రీ రాంసహాయ్ పాండే మృతికి ప్రధానమంత్రి సంతాపం
April 09th, 04:58 pm
ప్రముఖ జానపద కళాకారుడు పద్మశ్రీ రాంసహాయ్ పాండే మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సంగీతోత్సవానికి ప్రధానమంత్రి హాజరు
February 27th, 06:30 pm
న్యూఢిల్లీ సుందర్ నర్సరీలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సూఫీ సంగీతోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారు.పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 23rd, 11:30 am
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయనను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. సుభాష్ బాబుకు వినమ్ర పూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన జన్మస్థలంలో ఈ ఏడాది పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశా ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. నేతాజీ జీవిత విశేషాలను వివరించేలా భారీ ప్రదర్శనను కూడా కటక్ లో ఏర్పాటు చేశారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న అనేక వారసత్వ స్మారకాలను భద్రపరిచి ఈ ప్రదర్శనకు ఉంచారు. అనేకమంది చిత్రకారులు బోస్ జీవిత విశేషాలకు కాన్వాస్ పై చిత్రరూపమిచ్చారు. వీటన్నింటితో పాటు సుభాష్ బాబుకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా సేకరించారు. నేతాజీ ఈ ఘనమైన జీవిత ప్రస్థానం నా యువ భారతానికీ, నా భారతదేశానికి కొత్త శక్తిని అందిస్తాయి.పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం
January 23rd, 11:25 am
పరాక్రమ దివస్‌గా నిర్వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను యావత్ దేశం సగౌరవంగా స్మరించుకుంటోందని అన్నారు. నేతాజీ సుభాష్ బోస్‌కు నివాళులు అర్పిస్తూ, ఈ ఏడాది పరాక్రమ దివస్ ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన ఒడిశాలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేతాజీ జీవితం ఆధారంగా ఒడిశాలోని కటక్‌లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఎంతో మంది చిత్రకారులు నేతాజీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను కాన్వాస్‌పై చిత్రించారని అన్నారు. అలాగే నేతాజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను సైతం సేకరించినట్లు ఆయన తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఈ పరిణామాలు మేరీ యువ భారత్ లేదా మై భారత్‌కు కొత్త శక్తిని ఇస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.షహీదాబాద్ ఆర్ఆర్టీఎస్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ వరకూ నమో భారత్ రైలులో ప్రయాణం సందర్భంగా విద్యార్థులు, లోకోపైలట్లతో ప్రధాని సంభాషణ
January 05th, 08:50 pm
అవరోధాలను బద్దలు గొడుతూ, మన భవితను రూపుదిద్దుకుంటున్నాం.జాతీయ చేతి మగ్గం దినం సందర్భంగా ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
August 07th, 10:14 am
ఈ రోజు జాతీయ చేతి మగ్గం దినం సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. భారతదేశంలో చేతివృత్తుల వారి కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమానికి ప్రభుత్వం నిబద్ధతను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.వికసిత భారత్ అంబాసిడర్ ఆర్టిస్ట్ వర్క్‌షాప్ ఢిల్లీలోని పురానా క్విలాలో భారీ భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తుంది
March 10th, 11:18 pm
మార్చి 10, 2024న, ఢిల్లీలోని చారిత్రాత్మక పురానా క్విలా 'వికసిత భారత్ అంబాసిడర్స్ ఆర్టిస్ట్ వర్క్‌షాప్'ని నిర్వహించడంతో కళాత్మక శక్తితో నిండిపోయింది. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లలిత్ కళా అకాడమీ మరియు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. 2047 నాటికి వికసిత భారత్ అనే అంశంతో ఈ రోజు వర్క్‌షాప్ జరిగింది. వర్క్‌షాప్ రిజిస్ట్రేషన్‌లను ఉదయం 9 గంటలకు ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రతి కళాకారుడు స్కెచింగ్ నుండి యాక్రిలిక్ పెయింటింగ్, ఫోటోగ్రఫీ మరియు ఇతర కళారూపాల వరకు మాధ్యమాన్ని అన్వేషించడానికి ఉచితం.ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
January 23rd, 06:31 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు కిషన్ రెడ్డి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, మీనాక్షి లేఖి గారు, అజయ్ భట్ గారు, బ్రిగేడియర్ ఆర్ ఎస్ చికారా గారు, ఐఎన్ఎ వెటరన్ లెఫ్టినెంట్ ఆర్ మాధవన్ గారు, ప్రియమైన నా దేశప్రజలారా!ఢిల్లీ ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.
January 23rd, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు , ఢల్లీిలోని ఎర్రకోటవద్ద జరిగిన పరాక్రమ్ దివస్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భారత్ పర్వ్ ను ప్రారంభించారు. ఇందులో దేశ సుసంపన్న వైవిధ్యతను రిపబ్లిక్ దినోత్సవ శకటాలను, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. నేషనల్ ఆర్కైవ్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై ఫోటోలు, పెయింటింగ్స్, పుస్తకాలు, శిల్పాలతో కూడిన సాంకేతికత ఆధారిత ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి తిలకించారు. నేతాజీ స్కూల్ ఆఫ్ డ్రామా వారు నేతాజీ జీవితంపై ప్రదర్శించిన డ్రామాను ప్రధానమంత్రి తిలకించారు. ఐఎన్‌ఎ కి సంబంధించి జీవించి ఉన్న ఏకైక ప్రముఖుడు లెఫ్టినెంట్ ఆర్.మాధవన్ ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. పరాక్రమ్‌దివస్‌ను 2021 నుంచి నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి రోజు జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులను గౌరవించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరాక్రమ్ దివస్‌ను పాటిస్తున్నారు.తాను రాసిన గర్బా గీతం ఆలపించిన కళాకారులకు ప్రధానమంత్రి ధన్యవాదాలు
October 14th, 11:57 am
ఎన్నో ఏళ్ల కిందట తాను రచించిన గర్బా గీతాన్ని ఆలపించిన కళాకారులు ధ్వని భానుషాలి, తనిష్క్ బాగ్చి, ‘జస్ట్’ సంగీత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే నవరాత్రులలో మరో కొత్త గర్బా గీతాన్ని వారితో పంచుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.న్యూ ఢిల్లీలో కర్తవ్య పథ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
September 08th, 10:41 pm
నేటి ఈ చారిత్రాత్మక కార్యక్రమంపై దేశం మొత్తం ఒక దృష్టిని కలిగి ఉంది, ఈ సమయంలో దేశప్రజలందరూ ఈ కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూస్తున్న దేశప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ చారిత్రాత్మక సమయంలో, నా క్యాబినెట్ సహచరులు శ్రీ హర్దీప్ పూరీ జీ, శ్రీ జి కిషన్ రెడ్డి జీ, శ్రీ అర్జున్‌రామ్ మేఘవాల్ జీ, శ్రీమతి మీనాక్షి లేఖి జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ కూడా ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్నారు. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు.PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate
September 08th, 07:00 pm
PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రతిమ ను స్వీకరించిన ప్రధాన మంత్రి
April 05th, 02:40 pm
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి ప్రతిమ ను ఒకదానిని కళాకారుడు శ్రీ అరుణ్ యోగిరాజ్ వద్ద నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అందుకొన్నారు.పండిట్ భీమ్ సేన్ జోషి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 04th, 07:57 pm
పండిట్ భీమ్ సేన్ జోషి శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ,100 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల తర్వాత, భారతదేశం కొత్త ఉత్సాహం & శక్తితో ముందుకు సాగుతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 24th, 11:30 am
ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది.యువచిత్రకారుడి ని ఆయన చిత్రలేఖనాల కు మరియు ప్రజారోగ్యం పట్ల ఆయన లో ఉన్న శ్రద్ధ కుగాను ప్రశంసించిన ప్రధాన మంత్రి
August 26th, 06:02 pm
బెంగళూరు కు చెందిన ఒక విద్యార్థి శ్రీ స్టీవెన్ హ్యారిస్ ను ఆయన చిత్రించిన చిత్రలేఖనాలకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ తనకు ఒక ఉత్తరాన్ని పంపించారు. 20 యేళ్ల వయస్సు వున్న ఆ చిత్రకారుడు ప్రధాన మంత్రి కి ఒక లేఖ ను రాస్తూ, ప్రధాన మంత్రి తాలూకు సుందర వర్ణచిత్రాలు రెండిటిని ఆ లేఖ తో పాటు పంపారు. దీనికి ప్రధాన మంత్రి సమాధానమిస్తూ ఆ యువకుడి ని పొగడి, ఉత్సాహపరచారు.మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం
August 07th, 10:55 am
మధ్యప్రదేశ్ గవర్నర్, నా పాత సహచరుడు శ్రీ మంగుభాయ్ పటేల్, గిరిజన సమాజ శ్రేయస్సు కోసం, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం తన జీవితమంతా గడిపారు. ఆయనే మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరీమణులు, సోదరులందరూ !