సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
December 07th, 10:58 am
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల్లో సేవలందిస్తున్న ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు ప్రధానమంత్రి ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు.అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 10:30 am
ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం
October 20th, 10:00 am
ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.సాయుధ దళాల సర్వసన్నద్ధత కోసం కలసికట్టుతనం, ఆత్మనిర్భరత, ఆవిష్కరణల
September 15th, 03:34 pm
కోల్ కతాలో ఈ రోజు జరిగిన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ సమావేశాన్ని సాయుధ దళాల అత్యున్నత స్థాయి మేధోమథన వేదికగా పరిగణిస్తారు. ఇది దేశంలోని అగ్రశ్రేణి పౌర, సైనిక నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుంది. పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. భారత సైనిక సన్నద్ధతను మరింత మెరుగుపరిచేందుకు క్షేత్రస్థాయి కార్యాచరణను అందిస్తుంది. సాయుధ దళాల ప్రస్తుత ఆధునికీకరణ, మార్పులకు అనుగుణంగా 'సంస్కరణల సంవత్సరం - భవిష్యత్తు కోసం మార్పు‘ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.మావోవాదమనే భూతాన్ని అంతమొందించడానికి బలగాలు చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం: ప్రధాని
May 21st, 05:31 pm
మావోవాదమనే భూతాన్ని అంతమొందించడంతో పాటు మన దేశ ప్రజలకు శాంతియుత జీవనాన్నీ, పురోగతినీ అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా బలగాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన హర్షించారు.ఆదంపూర్ వైమానిక స్థావరం వద్ద ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ తెలుగు అనువాదం
May 13th, 03:45 pm
ఈ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసింది. భారత్ మాతా కీ జై! అన్నది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథం. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుంది. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ . భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేసినప్పుడు శత్రువుకు కనిపించింది ఒక్కటే... అదే ‘భారత్ మాతా కీ జై! అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’.ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
May 13th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదంపూర్‌లోని వైమానిక దళ కేంద్రాన్ని సందర్శించి ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో సంభాషించారు. వారితో మాట్లాడుతూ.. ‘భారత్ మాతా కీ జై’ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసిందన్నారు. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథమని వ్యాఖ్యానించారు. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక అని స్పష్టం చేశారు. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుందన్నారు. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందన్నారు. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ అంటూ భారత సైనిక పాటవాన్ని కొనియాడారు. భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేయగల సమర్థత మన దేశానికి ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు. అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’ అని ఆయన ప్రకటించారు.సాహసిక యోధులు, జవానులతో భేటీ కావడానికి ఏఎఫ్ఎస్ ఆదంపూర్‌ను సందర్శించిన ప్రధాని
May 13th, 01:04 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏఎఫ్ఎస్ ఆదంపూర్‌ను ఈ రోజు సందర్శించారు. మన దేశ సాహసిక యోధులను, సైనికులను కలుసుకోవడం కోసం ప్రధాని అక్కడికి వెళ్లారు. ‘‘ధైర్యం-సాహసం, దృఢ సంకల్పం, నిర్భయత్వం మూర్తీభవించిన వారితో భేటీ కావడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
May 10th, 02:31 pm
న్యూఢిల్లీలోని 7, లోకకల్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and Chiefs of Armed Forces
May 09th, 10:24 pm
PM Modi chaired a meeting attended by Defence Minister Shri Rajnath Singh, National Security Advisor Shri Ajit Doval, Chief of Defence Staff General Anil Chauhan, and Chiefs of the armed forces and senior officials.భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది
January 26th, 12:30 pm
కర్తవ్య పథంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ ఐక్యత, బలం మరియు వారసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. సాయుధ దళాల కవాతు బృందాలు క్రమశిక్షణ మరియు శౌర్యాన్ని ప్రదర్శించాయి, ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేశాయి. భారత వైమానిక దళం యొక్క ఉత్కంఠభరితమైన ఫ్లైపాస్ట్ ప్రేక్షకులను ఆకర్షించింది. వేడుకలకు హాజరైన ప్రజలను ప్రధాని కూడా పలకరించారు.సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు అభివాదం చేసిన ప్రధానమంత్రి
January 15th, 09:18 am
ఈ రోజు సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభివాదం చేశారు. భారత సైన్యం పట్టుదల, వృత్తిపరమైన నైపుణ్యం, అంకితభావానికి ప్రతీక అని అన్నారు. “సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొన్నేళ్లుగా మేము అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాం. ఆధునికీకరణపై దృష్టి పెట్టాం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం మన వరిష్ఠ సిబ్బంది, మాజీ సైనికోద్యోగుల ధైర్య సాహసాలకు, త్యాగాలకు మనమిచ్చే గౌరవం: ప్రధానమంత్రి
November 07th, 09:39 am
మన దేశ ప్రజల ప్రాణాలను రక్షించే కర్తవ్య పాలనలో మన త్రివిధ దళాల వరిష్ఠ ఉద్యోగులతో పాటు మాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకు, వారు చేసిన త్యాగాలకు గుర్తుగా మనం అందించిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం నిలుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఓఆర్ఓపీ పథకాన్ని ప్రారంభించి నేటికి పదేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ పథకం కోసం చాలా కాలంగా ఉన్న డిమాండును నెరవేర్చడమే కాకుండా, మన వీరులకు దేశం అందిస్తున్న గౌరవంగా ఆయన పేర్కొన్నారు. మన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడం కోసం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సాధ్యమైనంతగా కృషి చేస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.గుజరాత్, రాజస్థాన్‌లలో మార్చి 12న ప్రధానమంత్రి పర్యటన
March 10th, 05:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 12న గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ రోజున ముందుగా ఉదయం 9:15 గంటలకు గుజరాత్‌లో రూ.85,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు. అటుపైన ఉదయం 10 గంటలకు సబర్మతి ఆశ్రమానికి వెళ్లి, కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడంతోపాటు గాంధీ ఆశ్రమ స్మారక చిహ్నం బృహత్ ప్రణాళిను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్ శక్తి’ పేరిట రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలను ప్రదర్శించే త్రివిధ దళాల సంయుక్త, సమన్వయ యుద్ధ-వ్యూహ విన్యాసాలను ప్రధానమంత్రి నేరుగా తిలకిస్తారు.Glimpses from 75th Republic Day celebrations at Kartavya Path, New Delhi
January 26th, 01:08 pm
India marked the 75th Republic Day with great fervour and enthusiasm. The country's perse culture, prowess of the Armed Forces were displayed at Kartavya Path in New Delhi. President Droupadi Murmu, Prime Minister Narendra Modi, President Emmanuel Macron of France, who was this year's chief guest, graced the occasion.భారతదేశం కొత్త వ్యూహాత్మక శక్తిగా అవతరించింది .. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:46 pm
ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం కొత్త వ్యూహాత్మక శక్తిగా అవతరించింది. నేడు మన సరిహద్దులు గతంలో కంటే మరింత సురక్షితంగా ఉన్నాయి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రపంచ స్థాయిలో భద్రతా పరంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రత పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. సాయుధ బలగాల ఆధునీకరణకు అనేక సైనిక సంస్కరణలుఅమలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి సాయుధ బలగాలను పటిష్టం చేసి యుద్ధానికి సిద్ధం చేస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.ప్రధానితో 2022 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ శిక్షణార్థి అధికారుల సమావేశం
July 25th, 07:56 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) 2022 బ్యాచ్ శిక్షణార్థి అధికారులు ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్ నం.7లోగల ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో విస్తృతంగా సంభాషించారు. ఉద్యోగ బాధ్యతులు స్వీకరించిన తర్వాత ఇప్పటిదాకా వారి అనుభవాల గురించి ఆరాతీశారు. ఈ మేరకు వారు తమ శిక్షణ సమయంలో గ్రామ సందర్శన, భారత్ దర్శన్, సాయుధ దళాలతో సంధానంసహా అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. మొట్టమొదటగా తాము గమనించిన జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల పరివర్తన ప్రభావం గురించి కూడా వారు ప్రధానికి వివరించారు.If the world praises India it's because of your vote which elected a majority government in the Centre: PM Modi in Mudbidri
May 03rd, 11:01 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.PM Modi addresses public meetings in Karnataka’s Mudbidri, Ankola and Bailhongal
May 03rd, 11:00 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త కమాండర్ల సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి
April 01st, 08:36 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త సైనిక కమాండర్ల సదస్సుకు హాజరయ్యారు. “సంసిద్ధ-సముద్ధరిత-సముచిత” సాయుధ బలగాలు ఇతివృత్తంగా మూడు రోజులపాటు ఈ సమావేశం నిర్వహించబడింది. జాతీయ భద్రత, భవిష్యత్తు కోసం సంయుక్త సైనిక బలగాల దృక్పథం రూపకల్పనసహా వివిధ రకాల అంశాలపై ఈ సందర్భంగా చర్చలు సాగాయి. అదేవిధంగా ‘స్వయం సమృద్ధి’ సాధనసహా సాయుధ బలగాల సన్నద్ధత, రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షించారు.