ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న అర్జున్ ఎరిగైసికి ప్రధాని అభినందన

December 31st, 09:04 am

దోహాలో నిర్వహించిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఫిడే రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన కొన్ని రోజులకే ఆయన ఈ విజయాన్ని సాధించారు. ప్రపంచ చదరంగంలో భారత్‌కు గర్వకారణంగా నిలిచే మరో అపురూపమైన ఘట్టమిది.

ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్-2025లో కాంస్య పతకం సాధించిన అర్జున్ ఇరిగేశిని అభినందించిన ప్రధానమంత్రి

December 29th, 03:38 pm

దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఓపెన్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన అర్జున్ ఇరిగేశిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అతని పట్టుదల ప్రశంసనీయం. అతని భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నానని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

లైవ్ చెస్ రేటింగ్స్ లో 2800 మార్కును దాటిన అర్జున్ ఎరిగైసికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన

October 27th, 11:08 am

లైవ్ చెస్ రేటింగ్స్ లో 2800 మార్కును దాటినందుకు భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.