'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
October 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.