సంయుక్త ప్రకటన: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కువైట్ అధికారిక పర్యటన (డిసెంబరు 21-22)

December 22nd, 07:46 pm

గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 21-22 తేదీల్లో కువైట్ ను సందర్శించారు. ఆయన కువైట్ ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ నెల 21న కువైట్ లో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.

కువైట్ అమీరుతో ప్రధానమంత్రి భేటీ

December 22nd, 05:08 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్‌తో సమావేశమయ్యారు. ఈ నేతలిద్దరూ సమావేశం కావడం ఇది మొదటిసారి. బాయన్ ప్యాలెస్‌కు ప్రధాని చేరుకోవడంతోనే, కువైట్ ప్రధాని శ్రీ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ ఆయనకు సంప్రదాయబద్ధ పద్ధతిలో స్వాగతం పలికి, ప్యాలెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

అరేబియన్ గల్ఫ్ కప్‌: కువైట్ అమీరు గౌరవ అతిథి హోదాలో హాజరైన ప్రధానమంత్రి

December 21st, 10:24 pm

కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభ కార్యక్రమానికి అమీరు ‘గౌరవ అతిథి’ హోదాలో హాజరయ్యారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని కువైట్‌లో నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కువైట్ అమీరుతోనూ, యువరాజు, ప్రధానితోనూ కలిసి చూశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని కువైట్ నాయకత్వంతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ 'హలా మోదీ 'లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

December 21st, 06:34 pm

నేను కువైట్‌కు వచ్చి కేవలం రెండున్నర గంటలు మాత్రమే అయింది. అయితే, నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతం అనే భావన, ఆత్మీయతా భావం నన్ను అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. మీరు అందరూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, కానీ మీ అందరినీ చూసినప్పుడు, నాకు ఒక మినీ భారత దేశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల నుంచి వేర్వేరు భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాను. అయినా, అందరి హృదయాలలో ఒకే విధమైన ప్రతిధ్వని వినిపిస్తోంది, అందరి హృదయాలలో ఒకే గొంతు మారుమోగుతోంది – భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై!

కువైట్‌లో ‘హలా మోదీ’ కార్యక్రమం: భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 21st, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ నగరంలో షేక్ సాద్ అల్-అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ‘హలా మోదీ’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కువైట్‌లోని విభిన్న వర్గాలకు చెందిన భారత జాతీయులు హాజరయ్యారు.

కువైట్ పర్యటనకు ముందు ప్రధాని సందేశం

December 21st, 09:21 am

’’గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సభా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేను ఈ రోజు కువైట్ బయల్దేరుతున్నాను.