ఈ నెల 27 ఒడిశాలో ప్రధానమంత్రి పర్యటన

September 26th, 09:05 pm

టెలికాం కనెక్టివిటీ రంగంలో స్వదేశీ టెక్నాలజీతో.. దాదాపు రూ.37,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 97,500కి పైగా మొబైల్ 4జీ టవర్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన 92,600కి పైగా 4జీ టెక్నాలజీ ప్రాంతాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. డిజిటల్ భారత్ నిధి కింద 18,900కి పైగా 4జీ ప్రాంతాలకు నిధులు సమకూర్చగా.. మారుమూల, సరిహద్దు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని అనుసంధానం లేని దాదాపు 26,700 గ్రామాలను ఇవి అనుసంధానిస్తూ 20 లక్షలకు పైగా కొత్త చందాదారులకు సేవలు అందిస్తాయి. ఈ టవర్లు సౌరశక్తితో పనిచేస్తూ.. దేశంలో అతిపెద్ద గ్రీన్ టెలికాం సైట్‌ల సమూహంగా, సుస్థిరమైన మౌలిక సదుపాయాల్లో కీలక ముందడుగుగా నిలుస్తాయి.