‘సంవిధాన్ హత్యా దివస్’ సందర్భంగా ప్రజాస్వామ్య రక్షకులకు ప్రధానమంత్రి నివాళులు
June 25th, 09:32 am
దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించిన ఘట్టానికి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, దేశ చరిత్రలో చిమ్మచీకటి కమ్ముకొన్న అధ్యాయాల్లో ఒకటి కొనసాగిన కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఎదురొడ్డి నిలిచిన అసంఖ్యాక భారతీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక నివాళులు అర్పించారు.