క్రీడా రంగంలో సహకారానికి భారత్, ఆస్ట్రేలియా కార్యాచరణ ప్రణాళిక

July 10th, 10:07 am

క్రీడారంగంలో సహకారానికి ఉద్దేశించిన 2023 అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ) ఆధారంగా, భారత్, ఆస్ట్రేలియా ‘క్రీడా సహకార ప్రణాళిక’ రూపుదిద్దుకుంది. ఇది మన ద్వైపాక్షిక సంబంధాలను సుదృఢంగా తీర్చిదిద్దడానికి ఆచరణీయమైన, భవిష్యత్తు ప్రాథమ్యాలను, అవకాశాలను నిర్దేశిస్తోంది.

ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొనడానికి మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వెళ్లిన ప్రధానమంత్రి

July 10th, 08:21 am

ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథోనీ అల్బానీజ్, విక్టోరియా ప్రీమియర్ జెసిండా ఎలన్‌తో పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వెళ్లారు. భారత్, ఆస్ట్రేలియా క్రీడా సంబంధాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్శనను ఏర్పాటు చేశారు. శ్రీ స్టీవ్ వా, లిసా స్థలేకర్ సహా ఆస్ట్రేలియాకు చెందిన మేటి క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడలు, సాంస్కృతిక మార్పిడులు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు నానాటికీ భారత్, ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మూలాధారాలుగా మారుతున్నాయని ఇది నిరూపించింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

July 09th, 12:34 pm

ప్రస్తుతం ఉన్న భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనను (2009) ఇది పునరుద్ధరిస్తుంది. దళాల పరస్పర నిర్వహణ, సామర్థ్య పెంపుదల, సముద్ర తీర పరిధి, రక్షణ పారిశ్రామిక సహకారం, సైబర్ భద్రత- సాంకేతికత, ఉగ్రవాద నిరోధం, హెచ్ఏడీఆర్‌లతో పాటు యూఎన్‌సీఎల్ఓఎస్, ఆసియాన్, పీఐఎఫ్, ఐఓఆర్ఏలలో ఏకీకృత విధానాన్ని అనుసరించడాన్ని ఇది సహకార రంగాలుగా గుర్తిస్తుంది.

భారత్-ఆస్ట్రేలియా మూడో వార్షిక సదస్సులో ఆస్ట్రేలియా ప్రధానితో ప్రధానమంత్రి భేటీ

July 09th, 12:29 pm

మెల్బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా ప్రధాని గౌరవ ఆంథోనీ అల్బనీస్ ఎంపీ ఆతిథ్యంలో జరుగుతున్న 3వ భారత్-ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గవర్నమెంట్ హౌస్‌కు చేరుకున్న ప్రధానమంత్రి శ్రీ మోదీని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సాదరంగా స్వాగతించారు.

ఆస్ట్రేలియా-భారత్‌ ప్రధానమంత్రుల సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 09th, 11:15 am

అంతర్జాతీయ దృక్పథం, ప్రగాఢ పరస్పర విశ్వాసంతో రెండు దేశాలూ సంయుక్తంగా ముందడుగు వేయడంలో ఈ ఉమ్మడి విశిష్టతలే మనకెంతో స్ఫూర్తినిస్తాయి. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొన్నేళ్లుగా అద్భుత ప్రగతి సాధించిన నేపథ్యంలో నేటి మూడో వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తృతం చేసింది.

Australia-India Partnership on Cyber, Critical Technologies and Supply Chains (PACTS)

July 09th, 11:04 am

PM Modi and Australian Prime Minister Anthony Albanese launched the Australia-India Partnership on Cyber, Critical Technologies and Supply Chains (PACTS), paving the way for closer cooperation in cybersecurity, critical technologies, resilient supply chains, digital resilience and defence research collaboration

India-Australia Joint Statement on Energy Security

July 09th, 11:02 am

The India-Australia Joint Statement on Energy Security noted the two countries' deep concern over the situation in the Middle East. They shared their commitment to working together to strengthen energy supply chain resilience, including by deepening regional cooperation, accelerating the energy transition, promoting the uptake of renewable energy resources and upholding open trade arrangements for energy and liquid fuels.

Third India-Australia Annual Summit Joint Statement

July 09th, 10:58 am

At the invitation of Australian PM Anthony Albanese, PM Modi visited Australia from 8-10 July 2026 for the Third Australia-India Annual Summit in Melbourne. The two leaders reaffirmed their shared commitment to further consolidate and expand the India-Australia Comprehensive Strategic Partnership (CSP) and explore new areas of cooperation for the peace, prosperity and stability of the shared region.

రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై ఇండియా-ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన

July 09th, 10:55 am

భారత్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులమైన మేం.. మా మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఏకమై.. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా, శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన ప్రాంతంగా మార్చాలన్న ఉమ్మడి ఆశయంతో రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనకు కట్టబడి ఉంటామని తెలియజేస్తున్నాం.

ఎకనామిక్ రోడ్‌మ్యాప్ వాణిజ్య సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

July 09th, 06:15 am

ఇప్పుడు ఈ సరికొత్త మార్గం ద్వారా పెట్టుబడులు, ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయి. ఈ భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది.

Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event

July 09th, 06:00 am

PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌కు ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ

July 08th, 08:42 pm

ఇండోనేషియాలో ఫలవంతమైన పర్యటనను ముగించుకున్న అనంతరం, ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌కు చేరుకున్నారు. ఈ పర్యటన భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా, ఆయన ప్రధానమంత్రి అల్బనీస్‌తో చర్చలు జరిపి, ప్రవాస భారతీయులతో మమేకమవుతారు.

ఇండొనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన

July 06th, 09:00 am

ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతొ ఆహ్వానించడంతో, నేను ఈ నెల 6 నుంచి 8 వరకూ ఇండొనేషియాలో పర్యటిస్తాను. 2018లో నేను మొదటిసారి ఇండొనేషియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత్, ఇండొనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందింపచేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెరిగిన తరువాత ఇదే నేను చేపట్టబోయే మొదటి ద్వైపాక్షిక పర్యటన. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ అధికార పర్యటన అనంతరం నా ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అప్పట్లో అంటే.. 2025 జనవరి 26న ఆయన మన గణతంత్ర దినోత్సానికి ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్, ఇండొనేషియా మధ్య బలమైన నాగరికత సంబంధమైన ప్రజా సంబంధాలు నెలకొన్నాయి. నా ఈ పర్యటన మన బహుముఖీన భాగస్వామ్యానికి చెందిన అన్ని అంశాలనూ మరింత దృఢతరంగా మారుస్తుంది. నా పర్యటన కాలంలో, నేను ఇండొనేషియాలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులతోనూ సమావేశమవుతాను. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొతో కలిసి యోగ్యకర్త‌లోని ప్రంబానన్ దేవాలయ పరిసరాలను సందర్శిస్తాను. ఆ దేవాలయం మన సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు మరొక అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.

ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ప్రధానమంత్రి పర్యటన

July 03rd, 08:42 pm

ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. మే 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత, ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా... ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, ఇండేనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవోతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇరు దేశాల భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే భారీ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భారత్, ఇండోనేషియా దేశాల ప్రజల మధ్య చరిత్రాత్మక, ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు అనుగుణంగా... ఇండోనేషియాలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు.

Prime Minister Congratulates Australian Prime Minister H.E. Mr. Anthony Albanese and Ms. Jodie Haydon on their Wedding

November 29th, 09:05 pm

Prime Minister Shri Narendra Modi today extended his heartfelt congratulations to his good friend, Prime Minister of Australia, H.E. Mr. Anthony Albanese and Ms. Jodie Haydon on the occasion of their wedding.

Joint statement by the Government of India, the Government of Australia and the Government of Canada

November 22nd, 09:21 pm

India, Australia, and Canada have agreed to enter into a new trilateral partnership: the Australia-Canada-India Technology and Innovation (ACITI) Partnership. The three sides agreed to strengthen their ambition in cooperation on critical and emerging technologies. The Partnership will also examine the development and mass adoption of artificial intelligence to improve citizens' lives.

జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధాని మోదీ

November 21st, 10:43 pm

దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను 2020లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లిన అనంతరం గత ఐదేళ్లలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సహకారం మరింత బలంగా, వైవిధ్యంగా మారటం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి పట్ల ప్రధానమంత్రి అల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇద్దరు నాయకులు ప్రకటించారు.

PM Modi expresses gratitude to world leaders for birthday wishes

September 17th, 03:03 pm

The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

June 18th, 02:49 pm

ఈ నెల 17వ తేదీన కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంధోనీ అల్బనీజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి మోదీతో టెలిఫోన్‌లో సంభాషించిన ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి

June 04th, 04:52 pm

ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు టెలిఫోన్‌లో సంభాషించారు. తాజాగా జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ విజయం సాధించినందుకు ఉప ప్రధాని మార్లెస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.