మే 10న కర్ణాటక, తెలంగాణలో పీఎం పర్యటన

May 09th, 11:17 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.

జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధానమంత్రి నివాళి

January 30th, 10:41 am

జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. స్వదేశీ భావనకు బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారని, ఇదే అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన భారత్ అనే సంకల్పానికి మూలాధారమని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన వ్యక్తిత్వం, చేసిన పనులు కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలను ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ రెండో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 31st, 01:51 pm

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగి రెండేళ్లు పూర్తయిన శుభ సందర్భంగా దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నివాళి

December 15th, 08:44 am

ఈ రోజు భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశం మొత్తాన్ని ఏకం చేయడానికి, ఐక్యత అనే దారంతో భారత్‌ను కట్టి ఉంచడానికి సర్దార్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.

డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 01:00 pm

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూ, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టా, రాష్ట్ర మంత్రులు, వేదికను అలంకరించిన ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 09th, 12:30 pm

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.

ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ 25వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

November 09th, 09:05 am

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధాని నివాళి

October 08th, 10:20 am

బీహార్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

September 26th, 08:51 am

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి పదకొండేళ్లు…: ప్రధానమంత్రి

September 25th, 01:01 pm

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ 11వ వార్షికోత్సవం ఈ రోజు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థలో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఈ కార్యక్రమం గొప్ప మార్పును తీసుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

‘షికాగోలో ప్రపంచ సర్వ మత సమ్మేళనం- 1893’లో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగాన్ని ప్రజలతో పంచుకొన్న ప్రధానమంత్రి

September 11th, 08:49 am

షికాగోలో నిర్వహించిన ప్రపంచ సర్వ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగానికి 132వ వార్షికోత్సవం ఈ రోజు. ఈ శుభ సందర్భంగా ఇది ఒక చరిత్రాత్మక జ్ఞాపకమనీ, ఇది సద్భావననూ, విశ్వజనీన సోదరీసోదర భావాన్నీ ప్రధానంగా ప్రస్తావించిందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నిజానికి మన చరిత్రలో అన్నిటి కన్నా గర్వించదగిన, స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటి అని శ్రీ మోదీ అన్నారు.

మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన ప్రధానమంత్రి

July 26th, 06:47 pm

మాల్దీవుల దేశంలో అధికారిక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు ముయిజు ఆతిథ్యం ఇచ్చిన ప్రభుత్వాధినేత లేదా దేశ నాయకుడు కూడా ప్రధాని మోదీనే కావటం విశేషం.

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి.. ప్రధానమంత్రి నివాళులు

May 21st, 08:34 am

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

సిక్కిం 50 వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

May 16th, 10:13 am

సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సిక్కిం రాష్ట్రంగా అవతరించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనది! ప్రకృతి రమణీయత, సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలు, కష్టపడే తత్వం ఉన్న ప్రజలతో కూడిన రాష్ట్రమే సిక్కిం’’ అని శ్రీ మోదీ అన్నారు.

ముద్ర యోజన పదో వార్షికోత్సవం... ఈ పథకం గణనీయ ప్రభావాన్ని చూపుతోందంటూ ప్రధానమంత్రి ప్రశంసలు

April 08th, 09:08 am

‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ (పీఎంఎంవై) అమలులోకి వచ్చి పదేళ్లు కావడాన్ని (#10YearsOfMUDRA) దేశం పండుగ చేసుకొంటున్న వేళ ఈ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

మహోన్నత స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

March 30th, 11:42 am

మహోన్నత స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నివాళులు అర్పించారు.

ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సంగీతోత్సవానికి ప్రధానమంత్రి హాజరు

February 27th, 06:30 pm

న్యూఢిల్లీ సుందర్ నర్సరీలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సూఫీ సంగీతోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారు.

మహాత్మాగాంధీ వర్ధంతి... ప్రధానమంత్రి నివాళి

January 30th, 09:06 am

మహాత్మాగాంధీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైన వారందరికీ కూడా శ్రీ మోదీ నివాళులను అర్పించడంతోపాటు వారు చేసిన సేవలనూ, వారి త్యాగాలనూ గుర్తు చేశారు.

అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

January 11th, 09:53 am

అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తరువాత నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

December 15th, 09:32 am

ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రతతో పాటు అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని సాధించేందుకు శ్రీ పటేల్ వ్యక్తిత్వం, ఆయన కృషి ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.