
జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
June 06th, 12:50 pm
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారూ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారూ జితేంద్ర సింగ్ గారూ వి. సోమన్న గారూ, ఉప ముఖ్యమంత్రి సురేంద్ర కుమార్ గారూ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునిల్ గారూ, నా పార్లమెంటు సహచరుడు జుగల్ కిషోర్ గారూ, ఇతర ప్రజా ప్రతినిధులూ, ప్రియమైన సోదరీసోదరులరా... వీరుడైన జోరావర్ సింగ్ నడయాడిన గడ్డ ఇది. ఈ నేలకు ప్రణమిల్లుతున్నాను.
జమ్మూ కాశ్మీర్ లో రూ.46,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభం, అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
June 06th, 12:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో 46,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. ధైర్యవంతుడైన వీర్ జోరావర్ సింగ్ భూమికి వందనం చేస్తూ, నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప వేడుక అని ఆయన వ్యాఖ్యానించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ లోయ ఇప్పుడు భారతదేశంలోని విస్తారమైన రైల్వే నెట్వర్క్ తో అనునుసంధానితమైందని శ్రీ మోదీ అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో జూన్ 6న ప్రధానమంత్రి పర్యటన
June 04th, 12:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6న) జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంధానానికి పెద్ద పీట వేయాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధాని చినాబ్ వంతెనను ఉదయం 11 గంటలకు ప్రారంభించడమే కాకుండా వంతెనను చూడబోతున్నారు. ఆ తరువాత, ఆయన అంజీ బ్రిడ్జిని సందర్శించడంతో పాటు ఆ వంతెనను కూడా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. అనంతరం, రూ. 46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్‌రాలో ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతో పాటు వాటిని జాతికి అంకితమిస్తారు.