వియత‌్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం అధ్యక్షుడితో ఉమ్మడి మీడియా సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
May 06th, 01:00 pm
భారత్-వియత్నాం భాగస్వామ్యంలో వారసత్వం, అభివృద్ధి రెండూ కీలకమే. గతేడాది భారత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాంకు తీసుకువెళ్లినప్పుడు అక్కడి జనాభాలో సుమారు పదిహేను శాతం మంది అంటే.. పదిహేను మిలియన్లకు పైగా ప్రజలు వాటిని దర్శించుకున్నారు. మన ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించేందుకు, వియత్నాంలోని మై సన్, న్హాన్ టవర్స్ వద్ద ప్రాచీన చాం నాగరికత దేవాలయాల పునరుద్ధరణను మేం చేపడుతున్నాం. చాం నాగరికతకు సంబంధించిన రాతప్రతులను కూడా డిజిటలైజ్ చేసి, ఈ అమూల్యమైన వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరుస్తున్నాం.ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 01:25 pm
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, కార్యశీలుడైన ప్రజాదరణగల యువ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ అజయ్ టమ్టా, సాంకేతిక మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ సహా వేదికను అలంకరించిన మాజీ గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మాజీ ముఖ్యమంత్రులైన సోదరులు శ్రీ రమేష్ పోఖ్రియాల్, శ్రీ విజయ్ బహుగుణ, శ్రీ తీరథ్ సింగ్ రావత్, శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులందరికీ అభివందనం.ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
April 14th, 01:20 pm
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టమిది. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బైశాఖి, బోహాగ్ బిహు, పుతాండు పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పండుగ శోభ నెలకొన్న వేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు.ఏఐ పురోగతి నుండి టి20 ప్రపంచ కప్ వరకు, మన్ కీ బాత్‌లో భారతదేశ ఎదుగుదలను ప్రస్తావించిన ప్రధానమంత్రి మోదీ
February 22nd, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్‌లో, ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ తన అనుభవాల గురించి మాట్లాడారు. భారత సంతతికి చెందిన క్రికెటర్లు, అవయవ దానం, నదీ ఉత్సవాలు, డిజిటల్ భద్రత, పరీక్ష పే చర్చా వంటి అనేక ముఖ్యమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి భవన్‌లో 'రాజాజీ ఉత్సవ్' జరుపుకుంటామని ఆయన హైలైట్ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీకి నారీ శక్తితో ఉన్న లోతైన సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం
November 19th, 01:46 pm
సాయిరాం నామ స్మరణ నడుమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చేరుకున్నారు. స్థానికులు అత్యంత ఆత్మీయంగా ప్రధానమంత్రికి స్వాతం పలికారు.వన్యమృగాల సంరక్షణలో ఎప్పటికీ అగ్రగామిగా భారత్: ప్రధానమంత్రి
March 09th, 12:10 pm
భారత్‌లో వన్యప్రాణి వైవిధ్యం సమృద్ధిగా ఉందని, ఇక్కడి సంస్కృతి వన్యమృగాలను గౌరవిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మనం మన వన్యప్రాణులను పరిరక్షించుకోవడంతోపాటు భూగ్రహం చాలా కాలం పాటు మనుగడలో ఉండేటట్లు మన వంతు తోడ్పాటును అందించడంలో అన్ని దేశాల కన్నా ముందు నిలుద్దాం’’ అని శ్రీ మోదీ అన్నారు.వన్తారలో రోజు గడిపిన ప్రధాని మోదీ: ఆశతో అడవిని బాగు చేయడం
March 05th, 03:15 pm
మార్చి 4, 2025న, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ఒక అద్భుతమైన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం మరియు పరిరక్షణ కేంద్రం అయిన వన్తారను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లోపల 3,500 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న వన్తార ప్రపంచంలోనే అతిపెద్ద సదుపాయంగా నిలుస్తుంది, 2,000 కంటే ఎక్కువ జాతులలో 1.5 లక్షలకు పైగా రక్షించబడిన, అంతరించిపోతున్న మరియు అంతరించిపోతున్న జంతువులకు అభయారణ్యాన్ని అందిస్తుంది. వన్తార కేవలం ఒక ఆశ్రయం మాత్రమే కాదు, నైతిక జంతు సంక్షేమం మరియు పర్యావరణ స్థిరత్వం పట్ల భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న నిబద్ధతకు నిదర్శనం.గత పదేళ్లలో, పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా కూడా పెరిగింది.. ఇది వన్యప్రాణుల సంరక్షణకు మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, వాటికి చాలా కాలం కొనసాగగల నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో సూచిస్తోంది: ప్రధానమంత్రి
March 03rd, 12:36 pm
గత పది సంవత్సరాల్లో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ, వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను వాటికి కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం తెలియజేస్తోందన్నారు.శ్రీ రతన్ టాటా మృతికి ప్రధానమంత్రి సంతాపం విద్య, వైద్యం, పారిశుధ్యం, జంతు సంక్షేమం వంటి వాటిల్లో ఆయన ముందు వరుసలో నిలబడ్డారు: ప్రధాన మంత్రి
October 10th, 05:38 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ రతన్ టాటా మృతికి సంతాపం తెలిపారు. టాటా ఒక దార్శనిక వ్యాపార రంగ నాయకుడు, దయగల మనస్సున్న అసాధారణమైన వ్యక్తి అని..వినయం, దయ, సమాజాన్ని బాగు చేయాలనే అచంచలమైన నిబద్ధతతో ఎంతో మందికి దగ్గరయ్యారని మోదీ అన్నారు.లేగదూడకు ‘దీప్ జ్యోతి’ అనే పేరు పెట్టిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 12:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసంలో జన్మించిన ఒక దూడకు దీప్ జ్యోతి అనే పేరు పెట్టారు.అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా దేశంలోని యువత ప్రయోజనం పొందారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 25th, 11:30 am
మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
August 03rd, 09:35 am
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 03rd, 09:30 am
అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయశాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సమావేశ థీమ్ సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల దిశగా పరివర్తన. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాటడమే ఈ సమావేశ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి పొడిగింపునకు మంత్రివర్గం ఆమోదం
February 01st, 11:36 am
2025-26 వరకు మరో మూడేళ్లపాటు రూ.29,610.25 కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఐ డీ ఎఫ్) కింద అమలు చేయనున్న పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఏ హెచ్ ఐ డీ ఎఫ్) కొనసాగింపునకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం పాల ప్రాసెసింగ్ మరియు పాల ఉత్పత్తుల వైవిధ్యీకరణ, మాంసం ప్రాసెసింగ్ మరియు ఉత్పత్తుల వైవిధ్యం, పశుగ్రాసం ప్లాంట్, జాతుల అభివృద్ధి క్షేత్రం, జంతు వ్యర్థాల నుండి సంపద నిర్వహణ (వ్యర్థాల నిర్వహణ) మరియు పశు వ్యాక్సిన్ మరియు ఔషధ ఉత్పత్తి సౌకర్యాల కోసం పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.భారత్-గ్రీస్ సంయుక్త ప్రకటన
August 25th, 11:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25న గ్రీస్ దేశంలో అధికారికంగా పర్యటించారు. హెలెనిక్ గణతంత్రమైన గ్రీస్ ప్రధాని గౌరవనీయ కిరియాకోస్ మిత్సోతాకిస్ ఆహ్వానం మేరకు ఆ దేశాన్ని సందర్శించారు.గ్రీస్ లో పత్రికా విలేకరుల ఉమ్మడి సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన ఆంగ్ల అనువాదం
August 25th, 02:45 pm
గ్రీస్ లో అటవీ అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా తరఫున, భారత ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులైన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.వన్ ఎర్త్ వన్ హెల్త్ - అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
April 26th, 03:40 pm
ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖులు, ఆరోగ్యమంత్రులు, పశ్చిమాసియా, సార్క్, ఆసియాన్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన విశిష్ట ప్రతినిధులు భారతదేశానికి సాదర స్వాగతం పలుకుతున్నాను. నా మంత్రివర్గ సహచరులు, భారతీయ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ ప్రతినిధులకు నమస్కారం!2023వన్ హెల్త్ - అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023 సదస్సు 6వ ఎడిషన్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి
April 26th, 03:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో వన్ ఎర్త్ వన్ హెల్త్ - అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023 సదస్సును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించి ప్రసంగించారు.చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
March 25th, 11:40 am
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై గారు, సద్గురు శ్రీ మధుసూదన్ సాయి గారు, వేదికపై ఉన్న గౌరవనీయులు, మహిళలు మరియు పెద్దమనుషులు!కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 25th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్) ను ప్రారంభించారు. ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్ అందరికీ వైద్య విద్య , నాణ్యమైన వైద్య సంరక్షణను పూర్తి ఉచితంగా 2023 విద్యాసంవత్సరం నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.