ఒప్పందాల జాబితా: న్యూజిలాండ్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన

July 11th, 08:03 am

చర్చలు, సమన్వయం, సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి కార్యకలాపాల ద్వారా ఇండో-పసిఫిక్‌లో మెరుగైన నౌకా వాణిజ్య సహకారం కోసం ఒక విధాన ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది.

ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సు సందర్భంగా సంయుక్త ప్రకటన

July 02nd, 10:22 pm

జూలై 1 నుంచి 3, 2026 వరకు జరిగే ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి తకాయిచి సనాయె భారత్‌కు విచ్చేశారు. ప్రధానమంత్రి తకాయిచితో పాటు ఉన్నతాధికారులు, సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్ పర్యటనకు వచ్చింది. ప్రధానమంత్రి తకాయిచి భారతదేశంలో అధికారికంగా పర్యటించటం ఇదే తొలిసారి.

‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 19th, 11:54 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.

భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక [2026-2030]

May 17th, 03:15 am

2026 మే 16న హేగ్ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితితో కూడిన కార్యక్రమాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికల ద్వారా భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ లక్ష్య సాధన కోసం రాబోయే 5 సంవత్సరాల కాలానికి (2026-2030) ‘భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక’ను ఇరు దేశాలు ఆమోదించాయి.

నెదర్లాండ్స్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందాలు... ఒడంబడికలు

May 17th, 02:47 am

భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్‌ ప్రణాళిక [2026-2030]

కాంగ్రెస్ అంటే అబద్ధాల దుకాణం, ప్రజలను అవమానించేది: అస్సాంలోని హోజాయ్‌లో ప్రధాని మోదీ

April 06th, 11:20 am

అస్సాంలోని హోజాయ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో, ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి ఉదాహరణలు ఉటంకిస్తూ, వారి హామీలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయని అన్నారు. తప్పుదోవ పట్టించే వాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అస్సాం ఓటర్లను హెచ్చరించారు. అక్రమ చొరబాట్లు మరియు అస్సాం గుర్తింపు, భూమి, ఉపాధిపై దాని ప్రభావం గురించి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం

April 06th, 11:00 am

అస్సాంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో, ప్రధాని మోదీ బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఉత్సాహభరితమైన జనసమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆత్మనిర్భర, వికసిత అస్సాం దార్శనికతను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యతనిచ్చే రాజకీయాలు, అవినీతి, తప్పుడు వాగ్దానాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడం గురించి కూడా ఆయన మాట్లాడారు.

“వ్యవసాయ రంగం-గ్రామీణ రూపాంతరీకరణ” ఇతివృత్తంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

March 06th, 01:14 pm

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న మూడో వెబినార్‌కు మీ అందర్నీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. తొలి రెండు వెబినార్లలో సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక వృద్ధి వంటి కీలకాంశాలపై మనం సమీక్షించాం. ఇక నేటి వెబినార్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ-వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై చర్చ కేంద్రీకృతమైంది. బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో మీరంతా విలువైన సూచనలతో ఎంతగానో తోడ్పడ్డారు. మీరిచ్చిన సూచనలు, సలహాలు బడ్జెట్‌లో ప్రతిబింబించడంతో అవెంతో ఉపయుక్తమయ్యాని కూడా మీరు గమనించి ఉంటారు. అయితే, బడ్జెట్ సమర్పణ అనంతరం దేశం దాని పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, ఇప్పుడు మీ అనుభవం, సూచనలతో ప్రజలకు అత్యధికంగా బడ్జెట్ ప్రయోజనాలు అందేవిధంగా సరళ మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యం. తదనుగుణంగా బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి పైసాను పూర్తి స్థాయిలో సకాలంలో వినియోగించడంపై ఈ వెబినార్‌ సందర్భంగా మీరిచ్చే సలహాలకు ప్రాధాన్యం ఉంటుంది.

వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశాలపై పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 06th, 01:00 pm

వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై పోస్ట్ బడ్జెట్ మూడో వెబినార్‌ను ఉద్దేశించి ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సాంకేతికత, ఆర్థిక వృద్ధిపై గతంలో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకుంటూ, బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములందరూ ఎంతో సహకారాన్ని అందించారని ప్రధానమంత్రి తెలిపారు. బడ్జెట్ అనంతరం, దేశ సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి ప్రయోజనాలను పొందటం ముఖ్యం. ఈ దిశగా మీ సూచనలు, ఈ వెబినార్ ఎంతో కీలకమైనవి అని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

మార్చి 6న ‘వ్యవసాయం, గ్రామీణ పరివర్తన’ అంశంపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

March 05th, 06:04 pm

2026 మార్చి 6వ తేదీ ఉదయం 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ‘వ్యవసాయం, గ్రామీణ పరివర్తన’ అనే అంశంపై నిర్వహించే ‘బడ్జెట్ అనంతర వెబినార్‌’ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

The voice of the Global South becomes stronger and more confident when India and Brazil work together: PM Modi at the India-Brazil Joint Press Meet

February 21st, 12:30 pm

In his statement at the India-Brazil Joint Press Meet, PM Modi lauded Brazil President Lula’s vision and leadership and said that his visit has added grace to the AI Impact Summit. He noted that in their discussions they deliberated on advancing in every field with shared purpose and shared aspirations. The PM expressed confidence that the President's visit will deepen the strategic partnership and open new avenues of cooperation in the years ahead.

అనువాదం: కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

February 01st, 01:38 pm

నేటి బడ్జెట్ చారిత్రాత్మకమైనది. ఇది దేశంలోని 'నారీ శక్తి' (మహిళా శక్తి) శక్తిమంతమైన ప్రతిరూపంగా ఉంది. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా గారు వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించారు. అపారమైన అవకాశాలకు ఒక రాజమార్గం ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ వర్తమాన కాలపు కలలను సాకారం చేయడమే కాకుండా భారత్‌ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు మనం వేసే భారీ ప్రయాణానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వంటిది.

2026 కేంద్ర బడ్జెటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన

February 01st, 01:00 pm

భారత్‌లో ప్రస్తుతం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోందనీ, ఈ బడ్జెటుతో ఈ ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తినే కాకుండా ఓ కొత్త జోరును కూడా అందుకొంటుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇంతవరకు చేపట్టనటువంటి సంస్కరణల్ని చేపట్టినందువల్ల, భారత్‌లో వృద్ధి లోకి రావాలని తపించిపోతున్న, ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు వారు ఉవ్వెత్తున ఎగరడానికి విశాల గగనాన్ని బడ్జెటు వారి ఎదుట ఆవిష్కరించిందని ఆయన అన్నారు. నమ్మకమైన పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యాన్నిచ్చే ఆర్థిక ప్రణాళిక.. ఈ రెండు దృష్టికోణాలనూ బడ్జెటు సాకారం చేసిందని కూడా ఆయన చెప్పారు. ద్రవ్య లోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. వీటిపై దృష్టిని కేంద్రీకరించిన అద్వితీయ బడ్జెటు ఇదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

Ending TMC’s Maha Jungle Raj and bringing BJP’s good governance is essential: PM Modi in Singur, West Bengal

January 18th, 03:35 pm

PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”

PM Modi addresses a massive public rally in Singur, Hooghly, West Bengal

January 18th, 03:32 pm

PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”

‘వైబ్రంట్‌ గుజరాత్‌’ కచ్‌.. సౌరాష్ట్ర ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 11th, 02:45 pm

గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాననీయులు, పారిశ్రామిక ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 11th, 02:30 pm

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మోదీ మాట్లాడుతూ, 2026 ప్రారంభం తర్వాత తాను మొదటిసారి గుజరాత్‌కు వచ్చానని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తాను సోమనాథుని దివ్య దర్శనం చేసుకున్నానని, ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. “వికాస్ భీ, విరాసత్ భీ” (అభివృద్ధి - వారసత్వం) మంత్రం ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు దేశం నలుమూలల నుంచి, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల వచ్చిన అందరికీ ప్రధానమంత్రి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపారు.

అస్సాంలోని నామ్‌రూప్‌లో యూరియా ప్లాంటు భూమి పూజ సందర్భంగా ప్రధాని ప్రసంగం

December 21st, 04:25 pm

ఉజ్జనిర్ రాయజ్ కేనే ఆసే? ఆపునాలుకొలోయ్ ముర్ ఆంతోరిక్ మొరోమ్ ఆరు శ్రద్ధా జాసిసు.

PM Modi lays foundation stone of Ammonia-Urea Fertilizer Project of Assam Valley Fertilizer and Chemical Company Limited at Namrup, Assam

December 21st, 12:00 pm

In a major boost to the agricultural sector, PM Modi laid the foundation stone of Ammonia-Urea Fertilizer Project at Namrup in Assam. He highlighted the start of new industries, the creation of modern infrastructure, semiconductor manufacturing, new opportunities in agriculture, the advancement of tea gardens and their workers as well as the growing potential of tourism in Assam. The PM reiterated his commitment to preserving Assam’s identity and culture.

ఒమన్ సుల్తాన్ తో ప్రధానమంత్రి సమావేశం

December 18th, 05:22 pm

ఒమన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మస్కట్‌లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రాయల్ ప్యాలెస్‌ వద్ద ప్రధానమంత్రికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సాదర స్వాగతం పలికారు. అధికార లాంఛనాలతో కూడిన ఘనమైన స్వాగత కార్యక్రమం నిర్వహించారు.