కవి, మేధావి అందెశ్రీ మృతి.. ప్రధానమంత్రి సంతాపం

November 10th, 03:02 pm

ప్రముఖ కవి, మేధావి అందెశ్రీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అందెశ్రీ మృతి మన సాంస్కృతిక జగతికీ, మేధో ప్రపంచానికీ పెద్ద లోటు అని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మకు అద్దం పట్టాయి. ఆయన ఒక ప్రముఖ కవి, మేధావి. ప్రజల గొంతుకగా ఉంటూ, వారి సంఘర్షణలనూ, తపననూ, మొక్కవోని స్ఫూర్తినీ ఎలుగెత్తి చాటారు. ఆయన రచనలు హృదయాలను స్పందింపచేసి, ప్రజలను ఏకతాటి పైకి తెచ్చి, సమాజ సామూహిక స్పందనను తీర్చిదిద్దాయి. సామాజిక చైతన్యాన్ని సాహితీ శోభతో ఆయన కలబోసిన తీరు విశిష్టమైంది’’ అని శ్రీ మోదీ అన్నారు.