స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ - 2025లో స్వర్ణాన్ని గెలిచిన శ్రీ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్.. స్కేటింగ్‌లో భారత మొట్టమొదటి ప్రపంచ చాంపియన్ శ్రీ వేల్‌కుమార్‌యే.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

September 16th, 08:47 am

స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ - 2025లో భాగంగా నిర్వహించిన ‘సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్ప్రింట్ పోటీ’లో స్వర్ణ పతకాన్ని శ్రీ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. ‘‘ఆయన కనబరిచిన దృఢచిత్తం, వేగం, ఉత్సాహం.. ఇవే స్కేటింగ్‌లో భారత ప్రప్రథమ ప్రపంచ చాంపియన్‌గా నిలిపాయి. ఆయన సాధించిన ఈ విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుంది’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.

2022ఆసియా క్రీడల, పురుషుల స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలే పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్న క్రీడాకారులను అభినందించిన ప్రధానమంత్రి.

October 02nd, 12:25 pm

హాంగ్జోవులో జరుగుతున్న ఏసియన్ గేమ్స్ 2022 ,పురుషుల స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలే పోటీలలో కాంస్య పతకం గెలుచుకున్న ఆనందకుమార్ వెల్ కుమార్, సిద్ధాంత్ రాహుల్ కాంబ్లే, విక్రమ్ రాజేంద్ర ఇంగ్లేలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.