సంయుక్త ప్రకటన: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కువైట్ అధికారిక పర్యటన (డిసెంబరు 21-22)
December 22nd, 07:46 pm
గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 21-22 తేదీల్లో కువైట్ ను సందర్శించారు. ఆయన కువైట్ ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ నెల 21న కువైట్ లో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.కువైట్ యువరాజుతో ప్రధాని భేటీ
December 22nd, 05:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాతో ఆదివారం సమావేశమయ్యారు. సెప్టెంబరులో యూఎన్జీఏ సమావేశం సందర్భంగా యువరాజుతో తన ఇటీవలి సమావేశాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.కువైట్ అమీరుతో ప్రధానమంత్రి భేటీ
December 22nd, 05:08 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్‌తో సమావేశమయ్యారు. ఈ నేతలిద్దరూ సమావేశం కావడం ఇది మొదటిసారి. బాయన్ ప్యాలెస్‌కు ప్రధాని చేరుకోవడంతోనే, కువైట్ ప్రధాని శ్రీ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ ఆయనకు సంప్రదాయబద్ధ పద్ధతిలో స్వాగతం పలికి, ప్యాలెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.అరేబియన్ గల్ఫ్ కప్: కువైట్ అమీరు గౌరవ అతిథి హోదాలో హాజరైన ప్రధానమంత్రి
December 21st, 10:24 pm
కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభ కార్యక్రమానికి అమీరు ‘గౌరవ అతిథి’ హోదాలో హాజరయ్యారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని కువైట్‌లో నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కువైట్ అమీరుతోనూ, యువరాజు, ప్రధానితోనూ కలిసి చూశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని కువైట్ నాయకత్వంతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.