సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్
May 05th, 07:22 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను (భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి) ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 'సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026'ను పార్లమెంటులో ప్రవేశపెట్టటం ద్వారా సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టం- 1956ను సవరించనున్నారు.