రాయ్‌పూర్‌లో ప్రధానమంత్రి అధ్యక్షతన 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరళ్లు.. ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సు
November 30th, 05:17 pm
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహిస్తున్న 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరళ్లు-ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సుకు ఈ రోజు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ‘వికసిత భారత్: భద్రత ప్రమాణాలు’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సులో చివరి (3వ) రోజున ఆయన ప్రసంగిస్తూ- పోలీసులపై ప్రజాభిప్రాయంలో... ముఖ్యంగా యువతరంలో మార్పు తేవాల్సిన అవసరాన్ని స్పష్టీకరించారు. ఈ మేరకు వృత్తిగత నైపుణ్యంతోపాటు సామాజిక సున్నితత్వం, ప్రతిస్పందనాత్మకత వంటి లక్షణాలను పెంపొందించకోవడం అవశ్యమని పేర్కొన్నారు. అలాగే, పట్టణ పోలీసింగ్ పటిష్ఠం కావాలని, పర్యాటక పోలీసింగ్‌లో పునరుజ్జీవం అవసరమని చెప్పారు. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు.నవంబరు 29-30 తేదీల్లో రాయ్‌పూర్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్స్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సదస్సులో పాల్గొననున్న ప్రధాని
November 27th, 12:45 pm
నవంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. పోలీసు శాఖకు సంబంధించి కీలక సవాళ్ళ పరిష్కారంలో ఇంతవరకు సాధించిన పురోగతిని సమీక్షించడం, ‘వికసిత్ భారత్’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ‘సురక్షిత భారత్’ నిర్మాణం కోసం ముందుచూపుతో కూడిన ప్రణాళికను రూపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.పోలీసు డైరెక్టర్ జనరళ్లు/ఇన్స్పెక్టర్ జనరళ్ల 59వ అఖిల భారత సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి
December 01st, 07:49 pm
భువనేశ్వర్లో జరిగిన పోలీసు డైరెక్టర్ జనరళ్లు/ఇన్స్పెక్టర్ జనరళ్ల 59వ అఖిల భారత సదస్సులో నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్లో జరిగే డైరెక్టర్ జనరల్స్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సదస్సుకు హాజరు కానున్న ప్రధాని
November 29th, 09:54 am
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు ఒడిశాలో జరిగే డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత కాన్ఫరెన్స్ 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. భువనేశ్వర్లో ఉన్న లోక్ సేవాభవన్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.పోలీసు డైరెక్టర్ జనరల్స్/ఇన్ స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి
January 07th, 08:34 pm
ఈ సందర్భంగా కొత్త నేర చట్టాల రూపకల్పన గురించి చర్చిస్తూ దేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఈ చట్టాల రూపకల్పన ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పారు. ‘‘పౌరులే ప్రథమం, ఆత్మగౌరవం ప్రథమం, న్యాయం ప్రథమం’’ అనే స్ఫూర్తితో ఈ న్యాయ చట్టాలను రూపొందించామని ఆయన నొక్కి చెప్పారు. పోలీసులు ఇప్పుడు ‘‘దందా’’ విధానంలో కాకుండా ‘‘డేటా’’ ఆధారంగా పని చేయాలని సూచించారు. సమాజంలోని విభిన్న వర్గాలకు కొత్త న్యాయ చట్టాల వెనుక గల భావోద్వేగపూరితమైన స్ఫూర్తిని తెలియచేసేందుకు పోలీసు చీఫ్ లు ఇప్పుడు ఆలోచనాత్మకంగా పని చేయాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. మహిళలు, బాలికలకు తమ హక్కుల గురించి, కొత్త నేర చట్టాల కింద వారికి గల రక్షణల గురించి తెలియచేయాలని ఆయన తెలిపారు. ‘‘కభీ భీ ఔర్ కహీ భీ’’ (ఏ సమయంలో అయినా ఎక్కడైనా) మహిళలు స్వేచ్ఛగా పని చేసేందుకు వీలుగా మహిళల భద్రతపై పోలీసులు దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.