ఎస్తోనియా అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
February 11th, 06:19 pm
భారత్, ఎస్తోనియా ల మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలు ప్రజాస్వామ్యం, న్యాయపాలన, స్వాతంత్య్రం, సామ్యవాదం వంటి ఆదర్శాల ప్రాతిపదికగా ఏర్పడిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఐటీ, డిజిటల్, సాంస్కృతిక సంబంధాలు, పర్యాటకం, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు సహా ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందడం పట్ల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సైబర్ భద్రత అంశంలో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారాన్ని గురించి నేతలు చర్చించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఎస్తోనియా ప్రభుత్వాన్నీ కంపెనీలనూ శ్రీ మోదీ ఆహ్వానించారు.