భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు అద్భుతమైన వేగంతో పురోగమిస్తున్నాయన్న ప్రధానమంత్రి
June 05th, 05:10 pm
భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణం అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. భారత్‌లో దాదాపు రూ. 3 లక్షల కోట్లు (30 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టటంతో పాటు 5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్‌ట్రంక్ సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో రాబోతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా ఆయన అన్నారు.