గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ ఓశాట్‌’ కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

July 04th, 05:15 pm

ఎలా ఉన్నారు మీరందరూ? అంతా క్షేమమేనా? విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్‌, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అశ్వనీ వైష్ణవ్, ఉత్సాహవంతులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ‘సీజీ పవర్’ సంస్థ చైర్మన్ శ్రీ వేలయన్‌ సుబ్బయ్య, ‘రెనెసాస్ ఎలక్ట్రానిక్స్’ ప్రెసిడెంట్ కుమారి మాలిని, ‘సీజీ సెమీ’ సంస్థ చైర్మన్ శ్రీ గిరీష్ సహా ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర పారిశ్రామిక ప్రముఖులు, సోదరీసోదరులారా!

గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్

July 04th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్' (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేశం తన లక్ష్యాల పట్ల కలిగి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ప్రారంభోత్సవం ఒక నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశం తాను అనుకున్న బలమైన సంకల్పాలను ఎటువంటి సంకోచం లేకుండా నిరంతరం వాస్తవరూపంలోకి మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ఏదైనా చేయాలని సంకల్పిస్తే, దానిని కచ్చితంగా సాధిస్తుందనడానికి నేటి ఈ కార్యక్రమమే నిదర్శనం అని శ్రీ మోదీ అన్నారు.

సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన

June 28th, 08:30 pm

2026 జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో భాగంగా మహేలోని విక్టోరియాలో ఉన్న స్టేట్ ‌హౌస్‌లో సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు.

ఒప్పందాల జాబితా: సీషెల్స్‌‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన

June 28th, 08:17 pm

సీషెల్స్ ప్రభుత్వానికి ఒక ఫాస్ట్ పెట్రోల్ నౌక బహుమతి

The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave

June 10th, 06:33 pm

PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.

PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat

June 10th, 06:30 pm

PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.

మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన

May 06th, 05:24 pm

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 28th, 12:15 pm

ప్రారంభోత్సవం అయిపోయిందా? ప్రారంభోత్సవం అయిపోయిందా ? లేదు.. సగం పనే పూర్తయింది. నేను కేవలం ఆ కర్టెన్‌ను (తెరను) మాత్రమే తొలగించాను. కానీ నేడు ఇక్కడ ఉన్న మీ అందరి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీయండి. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయండి.. మీరే దీనిని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినట్లుగా ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. ఇది మీ ఆస్తి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కష్టం.. అందుకే దీని ప్రారంభోత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ మీ చేతులెత్తి, ఫ్లాష్‌లైట్లను పూర్తిగా చూపించండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయింది.

సుమారు రూ. 11,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ తొలి దశను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 28th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తపరుస్తూ.. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ అభియాన్‌లో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఈ విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేసి, నేడు తానే ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ భారీ విమానాశ్రయం పేరు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి ఉండటం మరో విశేషమని చెబుతూ.. నన్ను ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిన ఈ రాష్ట్ర గుర్తింపు, ఇప్పుడు ఈ అద్భుతమైన విమానాశ్రయంతో ముడిపడి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

Cabinet approves Regional Connectivity Scheme – Modified UDAN with a total outlay of Rs.28,840 crore

March 25th, 04:16 pm

The Union Cabinet, chaired by PM Modi, has approved the launch and implementation of the Regional Connectivity Scheme – Modified UDAN for a period of ten years from FY 2026-27 to FY 2035-36, with a total outlay of Rs. 28,840 crore. In line with the Viksit Bharat 2047 vision, this initiative will enhance regional air connectivity, boost economic growth, trade and tourism and promote the indigenous aerospace sector.

సంత్ గురు రవిదాస్ జీ 649వ జయంతి సందర్భంగా, ఫిబ్రవరి 1న పంజాబ్‌లో పర్యటించనున్న పీఎం

January 31st, 10:48 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 1, 2026న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ఆదంపూర్ విమానాశ్రయాన్ని సందర్శించి, 'శ్రీ గురు రవిదాస్ జీ ఎయిర్‌పోర్టు, ఆదంపూర్'గా కొత్త పేరును ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. లుథియానాలోని హల్వారా ఎయిర్‌పోర్టులో టెర్మినల్ భవనాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు.

హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా 2026లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 28th, 06:00 pm

కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రులు రామ్మోహన్ నాయుడు, మురళీధర్ మొహోల్, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడి వచ్చిన గౌరవ మంత్రులకు, అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ దిగ్గజాలకు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

January 28th, 05:45 pm

తెలంగాణలోని హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామిక దిగ్గజాలకు, నిపుణులకు, పెట్టుబడిదారులకు సాదరంగా స్వాగతం పలికారు. విమానయాన రంగంలో రాబోయే కాలం కొత్త ఆశయాలతో నిండి ఉంటుందని, ఇందులో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన పేర్కొన్నారు. విమానాల తయారీ, పైలట్ శిక్షణ, అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ వంటి రంగాల్లో భారత్ ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తోందని ప్రధాని వివరించారు. ప్రపంచ విమానయాన మార్కెట్లో భారతదేశం ఇప్పుడు ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని ఆయన చెప్పారు. విమానయాన రంగానికి చెందిన భాగస్వాములందరికీ ఈ 'వింగ్స్ ఇండియా' సదస్సు ఒక ముఖ్యమైన వేదిక అని ప్రధాని తెలిపారు.