అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో గాయపడిన వారికి ప్రధాని పరామర్శ
June 13th, 02:14 pm
అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్న అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అనంతరం ఈ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తితో సహా, గాయపడిన ఇతరులను పరామర్శించారు. ఈ ప్రతికూల సమయంలో వారికి దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం.. ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం
June 13th, 10:53 am
అహ్మదాబాద్ లో జరిగిన విమాన దుర్ఘటనలో ఎంతోమంది చనిపోయినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన సానుభూతిని తెలిపారు. వారికి కలిగిన అంతేలేని వేదన, వారికి కలిగిన లోటు ఎలాంటిదో తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు.అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి, సత్వర సహాయం అందిస్తామని హామీ
June 12th, 04:15 pm
ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన అని అన్నారు.