సృజనాత్మకత, సుస్థిరత, సమాజ స్ఫూర్తికి ప్రతీకగా అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన: ప్రధానమంత్రి ప్రశంసలు
January 02nd, 03:45 pm
సృజనాత్మకత, సుస్థిరత, సమాజ భాగస్వామ్యాన్ని ఒకచోట చేర్చడంలో అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన విశేషమైన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ప్రదర్శన నగరం ఉత్సాహభరితమైన స్ఫూర్తిని, ప్రకృతిపై శాశ్వత ప్రేమను అందంగా ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు.