Congress = shop of lies, insult to the people: PM Modi in Hojai, Assam
April 06th, 11:20 am
PM Modi addressed a massive public meeting in Hojai, Assam. In his speech, he cited examples from Congress-ruled states and said that their guarantees fail on the ground. He warned Assam’s voters to remain cautious of misleading promises. He also raised concerns over illegal infiltration and its impact on Assam’s identity, land, and employment.PM Modi addresses massive public meetings in Barpeta, Hojai and Dibrugarh
April 06th, 11:00 am
PM Modi addressed massive public meetings in Barpeta, Hojai and Dibrugarh, as election campaigning in Assam gathered strong momentum. Addressing enthusiastic crowds, PM Modi highlighted the vision of a self-reliant and Viksit Assam. He launched a strong attack on Congress, accusing it of promoting family-first politics, corruption, and false promises. He also spoke about expanding welfare initiatives along with ensuring reservation for women through the Nari Shakti Vandan Act.కోటా ఎయిర్‌పోర్ట్ భూమిపూజ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
March 07th, 03:15 pm
వారం కిందటే.. రాజస్థాన్‌ను సందర్శించే అవకాశం నాకు లభించింది. పవిత్రమైన అజ్మేర్ నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. శంకుస్థాపనలు చేశాం. అదే కార్యక్రమంలో 21,000 మందికి పైగా రాజస్థాన్ యువతకు నియామక పత్రాలను అందించాం. అజ్మేర్ పర్యటన చేపట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోటాలో ముఖ్యమైన విమానాశ్రయ ప్రాజెక్టు పనులను ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. ఒక వారంలోనే రాజస్థాన్‌లో ప్రారంభమైన ఈ రెండు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు శక్తిమంతమైన సందేశాన్నిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ ఎంత వేగంగా పురోగతి సాధిస్తుందో ఇవి చూపిస్తున్నాయి. అది మౌలిక వసతులు, యువతకు ఉద్యోగావకాశాలు, రైతులు, మహిళలకు పథకాలైనా లేదా ప్రతి రంగంలోనూ చేపడుతున్న కార్యక్రమాలైనా రాజస్థాన్లో వేగంగా పని జరుగుతోంది.కోటా విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని.. సమగ్రాభివృద్ధితో హడోటీ ప్రాంత రూపురేఖలు మారుతున్నాయన్న శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
హడోటీ ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న కోటా విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమాన్నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్ నేడు అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ నిర్మించబోతున్న కొత్త విమానాశ్రయం ఈ ప్రాంత ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి బలమైన చోదక శక్తిగా నిలవబోతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.గాంధీనగర్‌లో ‘రెండు దశాబ్దాల గుజరాత్ పట్టణ ప్రగతి పథం’ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 27th, 11:30 am
ఈ వేదికనలంకరించిన గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన నా ప్రియ సోదరీసోదరులారా!గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల ఉత్సవంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 27th, 11:09 am
గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల వేడుకనుద్దేశించి గాంధీనగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. పట్టణాభివృద్ధి సంవత్సరం- 2005కు ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణాభివృద్ధి సంవత్సరం-2025ను ఆయన ప్రారంభించారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో పర్యటన సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయ గర్జనలు, రెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలతో వెల్లివిరుస్తున్న దేశభక్తిని రెండు రోజులుగా ఆస్వాదిస్తున్నానన్నారు. ఈ కనువిందైన దృశ్యం ఒక్క గుజరాత్‌కే పరిమితం కాలేదనీ.. భారత్ నలుమూలలా, ప్రతి భారతీయుడి హృదయమూ ఇదే రకమైన భావనతో ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. “ఉగ్రవాదమనే కంటకాన్ని నిర్మూలించాలని సంకల్పించిన భారత్ దృఢ నిశ్చయంతో దానిని నెరవేర్చింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.మే 23న న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని
May 22nd, 04:13 pm
రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సును న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 23న ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అవకాశాల నిలయంగా ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని ప్రదర్శించి, అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం, కీలకమైన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం.రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం
February 06th, 04:21 pm
భారత్ సాధించిన విజయాలను, భారత్ పట్ల ప్రపంచ అంచనాలను, 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణం కోసం దేశంలోని సామాన్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంకల్పాన్ని గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎంతో చక్కగా వివరించారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా సాగిన వారి ప్రసంగం మనందరికీ భవిష్యత్ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఈ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రసంగానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
February 06th, 04:00 pm
పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, భారత్‌పై ప్రపంచం అంచనాలు, వికసిత భారత్ సంకల్ప సాకారంలో సామాన్యుల ఆత్మవిశ్వాసంవగైరాలను రాష్ట్రపతి ప్రసంగం విశదీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రభావవంతమైన ఈ ప్రసంగం భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసేదిగా ఉందని అభివర్ణించారు. ఇంతటి ఉత్తేజకర ప్రసంగం చేసినందుకుగాను రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.Experts and investors around the world are excited about India: PM Modi in Rajasthan
December 09th, 11:00 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.PM Modi inaugurates Rising Rajasthan Global Investment Summit
December 09th, 10:34 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. స్వయం సమృద్ధి/ఆహార భద్రత లక్ష్యంతో ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై).. ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకాల’ (కెవి)కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
October 03rd, 09:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను (సిఎస్ఎస్) రెండు సాముదాయక పథకాలుగా హేతుబద్ధీకరించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు ఐచ్ఛిక అనుసరణీయ (కెఫెటేరియా) ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై), ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకా’ల (కెవై)కు ఆమోదముద్ర వేసింది. వీటిలో ‘పిఎం-ఆర్‌కెవివై’ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేది కాగా, ఆహార భద్రత-వ్యవసాయ స్వయం సమృద్ధికి ‘కెవై’ దోహదం చేస్తుంది. ఈ సాముదాయ పథకాల కింద వివిధ పథకాలు-కార్యక్రమాలను సాంకేతికత సద్వియోగంతో ప్రభావవంతంగా, సమర్థంగా అమలు చేస్తారు.Today, the country is undertaking holistic initiatives for the betterment of tribal communities: PM Modi
October 27th, 02:46 pm
PM Modi addressed the program marking the centenary birth year celebrations of late Shri Arvind Bhai Mafatlal in Chitrakoot, Madhya Pradesh. PM Modi cited the life of Arvind Mafatlal as an example of glory of the company of saints as he dedicated his life and made it into a resolution of service in the guidance of Param Pujya Ranchhoddasji Maharaj. The PM said that we should imbibe the inspirations of Arvind Bhai.మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శత జయంతి ఉత్సవ సభలో ప్రధాని ప్రసంగం
October 27th, 02:45 pm
అంతటి ఔన్నత్యంగల ఆయన శత జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- చిత్రకూట్ అనే ఈ పవిత్ర భూమిని సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ఆవాసంగా సాధువులు పరిగణించేవారని పేర్కొన్నారు. రఘువీర్ ఆలయంతోపాటు శ్రీరామజానకీ ఆలయంలోనూ తాను దైవదర్శనం, పూజలు చేయడం గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. అలాగే హెలికాప్టర్‌లో చిత్రకూట్ వెళ్తూ కామత్‌గిరి పర్వతానికి పూజలు చేయడం గురించి కూడా మాట్లాడారు. పరమ పూజనీయ రణ్‌ఛోడ్ దాస్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించానని గుర్తుచేశారు. శ్రీరాముడు, జానకీదేవి దర్శనంతోపాటు సాధువుల మార్గదర్శకత్వం, శ్రీరామ సంస్కృత మహా విద్యాలయ విద్యార్థుల అద్భుత ప్రదర్శన తనకు ఎనలేని సంతోషం కలిగించాయని, దాన్ని వర్ణించడానికి మాటలు చాలవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అణగారిన, వెనుకబడిన, ఆదివాసీ, పేద వర్గాలన్నిటి తరఫునా స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడంపై శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జానకీ కుండ్ చికిత్సాలయంలో కొత్తగా ప్రారంభించిన విభాగం లక్షలాది పేదలకు కొత్త జీవితాన్ని ఇవ్వగలదని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలకు సేవ చేసే సంప్రదాయం భవిష్యత్తులో మరింత విస్తృతం కాగలదన్న విశ్వాసం వెలిబుచ్చారు. దివంగత శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించే గర్వించదగిన అవకాశం లభించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ 2021 లో ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా ఇచ్చిన ప్రసంగం పాఠం
September 03rd, 10:33 am
ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మరి ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు నేను ధన్యావాదాలు వ్యక్తం చేస్తున్నాను.వ్లాదివోస్తోక్ లో జరిగిన 6వ ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ 2021 లో వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 03rd, 10:32 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్లాదివోస్తోక్ లో ఈ రోజు న జరిగిన 6వ ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ (ఇఇఎఫ్) సర్వ సభ్య సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. 2019వ సంవత్సరం లో జరిగిన ఇఇఎఫ్ 5వ సదస్సు లో ముఖ్య అతిథి గా ప్రధాన మంత్రి వ్యవహరించారు. ఇఇఎఫ్ సదస్సు లో భారతదేశ ప్రధాన మంత్రి ముఖ్య అతిథి గా వ్యవహరించడం అదే తొలి సారి.