నమీబియా జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 08:14 pm
ప్రతి ఒక్కరికి శుభాభినందనలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అద్భుత అవకాశాన్ని మీకు మీ ప్రజలు కల్పించారు. రాజకీయాల్లో ఇదొక గొప్ప అవకాశమే కాక, పెద్ద సవాలు కూడా! మీ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయగలరని ఆశిస్తున్నాను.Prime Minister addresses the Namibian Parliament
July 09th, 08:00 pm
PM Modi addressed the Parliament of Namibia and expressed gratitude to the people of Namibia for conferring upon him their highest national honour. Recalling the historic ties and shared struggle for freedom between the two nations, he paid tribute to Dr. Sam Nujoma, the founding father of Namibia. He also called for enhanced people-to-people exchanges between the two countries.ఘనా పార్లమెంటునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 03rd, 03:45 pm
ప్రజాస్వామ్య స్ఫూర్తి, గౌరవం, దృఢత్వంతో తొణికిసలాడే ఘనా దేశాన్ని సందర్శించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా, నా వెంట 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చాను.ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 03rd, 03:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఘనా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ గౌరవనీయ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ నిర్వహించిన ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఇరు దేశాల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రసంగం భారత్-ఘనా సంబంధాల్లో ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది. ఇది రెండు దేశాలను ఏకం చేసే పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించింది.ఘనా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన... ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం
July 03rd, 12:32 am
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించారు.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
June 07th, 02:00 pm
విపత్తు నిరోధక సుస్థిర మౌలిక సదుపాయాల (డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పై అంతర్జాతీయ సదస్సు 2025 కు స్వాగతం. యూరప్ లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు నిర్వహణకు మద్దతు అందించిన నా మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ కు, ఫ్రాన్స్ ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సముద్రాలపై త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సదస్సు (యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్) సందర్భంగా కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.విపత్తు నిరోధక సుస్థిర మౌలిక సదుపాయాలు 2025పై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 07th, 01:26 pm
విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యూరప్ లో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ “డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2025” అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సదస్సును నిర్వహించడంలో సహకరించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు, ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి సముద్రాల సదస్సు సందర్భంగా కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.అంగోలా అధ్యక్షుడితో నేటి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
May 03rd, 01:00 pm
గౌరవనీయ అధ్యక్షులు లొరెన్సూ సహా ఆయన ప్రతినిధి బృందానికి భారత్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇదొక చారిత్రక క్షణం... 38 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు కొత్త దిశ, దశలను నిర్దేశించడంతోపాటు మరింత ఊపునిస్తూ భారత్-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తుంది.టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 08:00 pm
గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.టీవీ9 సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 28th, 06:53 pm
భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.‘ఎన్‌ఎక్స్‌టి’ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 01st, 11:00 am
‘న్యూస్ ఎక్స్ వరల్డ్’ శుభప్రదంగా ప్రారంభమైంది... ఈ నేపథ్యంలో మీకందరికీ నా అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంగ్ల, హిందీ భాషలు సహా మీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రాంతీయ ఛానెళ్లన్నీ కూడా ఇప్పుడు వేగంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. దీనికితోడు నేడు అనేక పరిశోధక సభ్యత్వాలు (ఫెలోషిప్), ఉపకార వేతనాలకు (స్కాలర్‌షిప్) శ్రీకారం చుట్టారు. ఈ కార్యకలాపాలన్నిటిపైనా మీకు శుభాకాంక్షలు.ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 10:34 am
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. న్యూస్ఎక్స్ వరల్డ్ ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఛానల్‌లను కలిగి ఉన్న ఈ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పలు ఫెలోషిప్‌లు, ఉపకారవేతనాల ప్రారంభాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.నైజీరియాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం
November 17th, 07:20 pm
మీరు ఈ రోజు అబుజాలో ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టించారు. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న ప్రతి అంశాన్ని నేను గమనిస్తున్నాను. నేను అబుజాలో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. భారత్‌లోని ఓ నగరంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. లాగోస్, కనో, కడునా, పోర్ట్ హర్కోర్ట్ తదితర విభిన్నమైన ప్రాంతాల నుంచి మీరు అబుజాకి వచ్చారు. మీ ముఖాల్లోని వెలుగు, మీరు చూపిస్తున్న ఉత్సాహం, ఇక్కడకు రావాలనే మీ తపనను తెలియజేస్తున్నాయి. నేను కూడా మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూశాను. మీ ప్రేమాభిమానాలు నాకు గొప్ప నిధి లాంటివి. మీలో ఒకడిగా, మీతో కలసి పంచుకునే ఈ క్షణాలు నాకు జీవితాంతం మరపురాని అనుభవాలుగా మిగిలిపోతాయి.నైజీరియాలోని భారతీయ సమాజ పౌరులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 17th, 07:15 pm
నైజీరియా దేశం అబూజాలో తన గౌరవార్థం స్థానిక భారతీయ సమాజం ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. స్థానిక భారతీయులు అందించిన ఘన స్వాగతనికి, చూపిన ఉత్సాహం, గౌరవాభిమానల పట్ల ఆనందం వెలిబుచ్చిన ప్రధాని, వారి స్నేహమే తనకు పెట్టుబడివంటిదన్నారు.Success of Humanity lies in our collective strength, not in the battlefield: PM Modi at UN Summit
September 23rd, 09:32 pm
Prime Minister Narendra Modi addressed the 'Summit of the Future' at the United Nations in New York, advocating for a human-centric approach to global peace, development, and prosperity. He highlighted India's success in lifting 250 million people out of poverty, expressed solidarity with the Global South, and called for balanced tech regulations. He also emphasized the need for UN Security Council reforms to meet global ambitions.Prime Minister’s Address at the ‘Summit of the Future’
September 23rd, 09:12 pm
Prime Minister Narendra Modi addressed the 'Summit of the Future' at the United Nations in New York, advocating for a human-centric approach to global peace, development, and prosperity. He highlighted India's success in lifting 250 million people out of poverty, expressed solidarity with the Global South, and called for balanced tech regulations. He also emphasized the need for UN Security Council reforms to meet global ambitions.వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 ప్రారంభ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం
August 17th, 10:00 am
140 కోట్ల మంది భారతీయుల తరఫున, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత రెండు శిఖరాగ్ర సమావేశాల్లో, మీలో చాలా మందితో సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఈ సంవత్సరం భారత సార్వత్రిక ఎన్నికల తరువాత, ఈ వేదికపై మీ అందరితో సంభాషించే అవకాశం నాకు మరోసారి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్- కామన్వెల్త్ అటార్నీ.. సొలిసిటర్స్ జనరల్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
February 03rd, 11:00 am
ఈ సదస్సును ప్రారంభించడం నాకెంతో ఆనందదాయకం. ప్రపంచవ్యాప్తంగాగల ప్రముఖ న్యాయకోవిదులు ఈ సదస్సుకు హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున మా అంతర్జాతీయ అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. అద్భుత భారతదేశంలోని ప్రతి అణువునూ ఆమూలాగ్రం ఆస్వాదించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.