‘వికసిత భారత్ యువ సారథుల చర్చాగోష్ఠి-2026’ ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 12th, 06:45 pm

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఎంపీలు, వికసిత భారత్ యువ సారథుల పోటీ విజేతలు, ఇతర ప్రముఖులు, దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి హాజరైన నా యువ మిత్రులందరూ ఇక్కడ ఓ కొత్త అనుభూతిని పొంది ఉంటారు. మీరంతా అలసిపోలేదా? ఇప్పటికి రెండు రోజుల నుంచి అదేపనిగా ప్రసంగాలు వింటూనే ఉన్న మీకు మరోసారి వినడం అలసట అనిపిస్తోందా? ఏదేమైనా, పత్రికా సమావేశం సందర్భంగా నేను చెప్పాల్సిందేమిటో ఇప్పటికే చెప్పేశాను. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి మీలో చాలామంది పుట్టి కూడా ఉండరని నేను అనుకుంటున్నా. ఇక 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మీలో అధికశాతం ఇంకా పిల్లలుగానే ఉండి ఉంటారు. అయితే, ముఖ్యమంత్రిగా లేదా ఇవాళ ప్రధానమంత్రిగా యువతరంపై నాకు సదా అపారమైన నమ్మకం. మీ సామర్థ్యం, ప్రతిభ నుంచి నాకెప్పుడూ నవ్యోత్తేజం లభిస్తూంటుంది. ఈ నేపథ్యంలో వికసిత భారత్‌ స్వప్న సాకార సారథ్యం బాధ్యతను మీరు స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా.

‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చావేదిక - 2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 12th, 06:30 pm

న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చావేదిక - 2026’ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. శ్రీ మోదీ ప్రసంగిస్తూ, తాను ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, నేటి యువ పౌరులలో చాలా మంది ఇంకా పుట్టలేదని, అలాగే, 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలుగానే ఉన్నారని తెలిపారు. గడచిన కాలంతో నిమిత్తం లేకుండా యువతరంపై తన నమ్మకం స్థిరంగా, అచంచలంగా ఉందని ఆయన చెప్పారు. “మీ సామర్థ్యం, మీ ప్రతిభ, మీ బలం నుంచే నేను ఎల్లప్పుడూ శక్తిని పొందాను. ఈ రోజు మీరందరూ అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధన పగ్గాలను చేతబట్టారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

Cabinet approves Rs.7,280 Crore for Sintered Rare Earth Permanent Magnets Scheme

November 26th, 04:25 pm

The Union Cabinet, chaired by PM Modi, has approved the 'Scheme to Promote Manufacturing of Sintered Rare Earth Permanent Magnets' with an outlay of Rs. 7,280 crore. The initiative aims to establish 6,000 MTPA of integrated Rare Earth Permanent Magnet manufacturing in India, boosting self-reliance and strengthening India's position in the global market.

హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

November 26th, 10:10 am

నేను పార్లమెంటుకు చేరుకోవాల్సి ఉన్నందున సమయం చాలా తక్కువగా ఉంది. గౌరవ రాష్ట్రపతితో ఒక కార్యక్రమం ఉంది. అందువల్ల ఎక్కువసేపు మాట్లాడకుండా నేను కొన్ని అంశాలను త్వరగా పంచుకుని... నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ రోజు నుంచి భారత విమానయాన రంగం కొత్త ఊపును పొందబోతోంది. ఈ కొత్త శాఫ్రాన్ కేంద్రం భారత్‌ను ప్రపంచ ఎంఆర్వో కేంద్రంగా నిలపడంలో సహాయపడుతుంది. ఈ ఎంఆర్వో కేంద్రం హైటెక్ ఏరోస్పేస్ ప్రపంచంలో యువతకు కొత్త అవకాశాలనూ సృష్టిస్తుంది. నేను ఈనెల 24న సాఫ్రాన్ బోర్డు యాజమాన్యాన్ని కలిశాను. నేను వారిని ఇంతకు ముందు కూడా కలిశాను. ప్రతి చర్చలోనూ భారత్ పట్ల వారి నమ్మకం, ఆశను నేను చూశాను. భారత్‌లో శాఫ్రాన్ పెట్టుబడి అదే వేగంతో కొనసాగుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఈ కేంద్రం కోసం కృషి చేసిన టీం శాఫ్రాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

హైదరాబాద్‌లోని ‘శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి

November 26th, 10:00 am

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. శాఫ్రాన్‌ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు) కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ ఎంఆర్ఓ కేంద్రం అత్యాధునిక సాంకేతిక గల విమానాయన రంగంలో యువతకు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. నవంబర్ 24న శాఫ్రాన్ బోర్డు, అధికారుల బృందాన్ని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికంటే ముందు కూడా వారితో జరిగిన ప్రతి చర్చలో భారత్‌ పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో శాఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా శాఫ్రాన్ బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రధానమంత్రి పర్యటన

March 28th, 02:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్‌ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు.

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా భార‌త్‌-ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటన

February 12th, 03:22 pm

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10-12 తేదీల్లో ఫ్రాన్స్‌ను సందర్శించారు. ఈ రెండు రోజుల్లో అక్కడ నిర్వహించిన కృత్రిమ మేధ (ఎఐ) కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు రెండు దేశాలూ సంయుక్తంగా అధ్యక్షత వహించాయి. బ్లెచ్లీ పార్క్ (2023 నవంబర్), సియోల్ (2024 మే) శిఖరాగ్ర సదస్సులు తీర్మానించిన మేరకు సాధించిన కీలక విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఈ సదస్సు చర్చించింది. ఇందులో వివిధ దేశాల-ప్రభుత్వాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతోపాటు చిన్న-పెద్ద వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు సహా కళాకారులు-పౌర సమాజ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉపయోగకర సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సత్ఫలితాల సాధనకు అంతర్జాతీయ కృత్రిమ మేధ రంగం సారథ్యం వహించేలా నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి అంకిత భావంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సును విజయవంతంగా నిర్వహించారంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. తదుపరి శిఖరాగ్ర సదస్సును భారత్‌ నిర్వహించనుండటంపై ఫ్రాన్స్ హర్షం వ్యక్తం చేసింది.

భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 12th, 12:25 am

ఈ రోజు ప్యారిస్‌లో నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్‌...ప్రసంగించారు. ఈ ఫోరమ్ ఇరు పక్షాలకు చెందిన వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓల)ను ఒక చోటుకు చేర్చింది. ఇది రక్షణ, ఏరోస్పేస్, కీలక టెక్నాలజీలు-కొత్తగా ఉనికిలోకి వస్తున్న టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, కృత్రిమ మేధ, వైద్య ఆరోగ్య శాస్త్రాలు, జీవనశైలిలతోపాటు ఆహారం, ఆతిథ్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూజీలాండ్ ప్రధాని లక్సన్ సంభాషణ

July 20th, 02:37 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూజీలాండ్ ప్రధాని గౌరవనీయ క్రిస్టఫర్ లక్సన్ ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా భారత సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని మోదీ మరోసారి ఎన్నిక కావడంపై ప్రధాని లక్సన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

PM Modi attends News18 Rising Bharat Summit

March 20th, 08:00 pm

Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.

The four astronaut-designates symbolize the trust, courage, valor and discipline of today’s India: PM Modi

February 27th, 12:24 pm

PM Modi visited Vikram Sarabhai Space Center (VSSC) at Thiruvananthapuram, Kerala and inaugurated three important space infrastructure projects worth around Rs 1800 crores. Recalling his statement about the beginning of a new ‘kaal chakra’ made from Ayodhya, Prime Minister Modi said that India is continuously expanding its space in the global order and its glimpses can be seen in the country’s space program.

కేరళలో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి ఎస్ ఎస్ సి) ను సందర్శించిన ప్రధాన మంత్రి

February 27th, 12:02 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురంలో విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి.ఎస్.ఎస్.సి)ని సందర్శించారు సుమారు రూ.1800 కోట్ల విలువైన మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఎస్ఎల్ వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పిఐఎఫ్); . మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో కొత్త 'సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ'; తిరువనంతపురంలోని వి.ఎస్.ఎస్.సి వద్ద 'ట్రైసోనిక్ విండ్ టన్నెల్' ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా గగన్ యాన్ మిషన్ పురోగతిని సమీక్షించిన మోదీ, మిషన్ ద్వారా అంతరిక్షం లోకి వెళ్లేందుకు నియమితులైన నలుగురు వ్యోమగాములకు 'వ్యోమగామి వింగ్స్‘ ప్రదానం చేశారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వీరిలో ఉన్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం

February 14th, 04:31 pm

ముందుగా ఈ చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్న ఎయిర్ ఇండియాకు, ఎయిర్ బస్ కు నా అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా మిత్రుడైన అధ్యక్షుడు మాక్రన్ ను ప్రత్యేక ధన్యవాదాలు.

ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడంపై ఫ్రెంచ్ అధ్యక్షుడితో వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు

February 14th, 04:30 pm

ఫ్రాన్స్ అధ్యక్షుడు హెచ్‌ఈతో వీడియో కాల్‌లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్ భాగస్వామ్యాన్ని ప్రారంభించిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

కర్ణాటకలోని తుమకూరులో 'తుమకూరు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్' శంకుస్థాపన, హెచ్‌ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

February 06th, 04:20 pm

కర్ణాటక సాధువులు మరియు ఋషుల భూమి. ఆధ్యాత్మికత, విజ్ఞానం మరియు విజ్ఞాన శాస్త్రం యొక్క గొప్ప భారతీయ సంప్రదాయాన్ని కర్ణాటక ఎల్లప్పుడూ బలపరుస్తుంది. ఇందులో కూడా తుమకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో సిద్దగంగ మఠం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈరోజు శ్రీ సిద్ధలింగ మహాస్వామి వారు 'త్రివిధ దాసోహ' అంటే అన్న, అక్షర మరియు ఆశ్రయ పూజ్య శివకుమార స్వామీ జీ వదిలిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గౌరవనీయులైన సాధువులకు నేను నమస్కరిస్తున్నాను. శ్రీ చిదంబరానికి కూడా నమస్కరిస్తున్నాను. ఆశ్రమం మరియు గుబ్బిలో ఉన్న చన్నబసవేశ్వర స్వామి!

తుముకూరులో హెచ్ఎఎల్ హెలికాప్టర్ ఫాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని

February 06th, 04:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తుముకూరులో ఈరోజు హెచ్ఎఎల్ హెలికాప్టర్ ఫాక్టరీని జాతికి అంకితం చేశారు. తుముకూరులో పారిశ్రామిక టౌన్ షిప్ కు, తిప్తూర్, చిక్కనాయకనహళ్ళి దగ్గర రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు కూడా ప్రధాని ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్ తయారీ కేంద్రంలో కాసేపు తిరిగిన ప్రధాని తేలికపాటి వినియోగ హెలికాప్టర్ ను ఆవిష్కరించారు.

Vision of self-reliant India embodies the spirit of global good: PM Modi in Indonesia

November 15th, 04:01 pm

PM Modi interacted with members of Indian diaspora and Friends of India in Bali, Indonesia. He highlighted the close cultural and civilizational linkages between India and Indonesia. He referred to the age old tradition of Bali Jatra” to highlight the enduring cultural and trade connect between the two countries.

ఇండోనేశియా లోని బాలి లో భారతీయ సముదాయం మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా తోభేటీ అయిన ప్రధాన మంత్రి

November 15th, 04:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా లోని బాలి లో భారతీయ ప్రవాసులు మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా 8 వందల మంది కి పైగా సభికులతో 2022 నవంబర్ 15వ తేదీ న సమావేశమై, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాని కి ఇండోనేశియా నలు మూలల నుండి విభిన్న వర్గాల వారు పలువురు ఉత్సాహం గా తరలివచ్చారు.

Make in India, Make for the Globe: PM Modi in Vadodara, Gujarat

October 30th, 02:47 pm

PM Modi laid the foundation stone of the C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat. The Prime Minister remarked, India is moving forward with the mantra of ‘Make in India, Make for the Globe’ and now India is becoming a huge manufacturer of transport aircrafts in the world.

PM lays foundation stone of C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat

October 30th, 02:43 pm

PM Modi laid the foundation stone of the C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat. The Prime Minister remarked, India is moving forward with the mantra of ‘Make in India, Make for the Globe’ and now India is becoming a huge manufacturer of transport aircrafts in the world.