ఏప్రిల్ 14న ఉత్తరాఖండ్, యూపీల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి
April 13th, 04:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 14న ఉత్తరాఖండ్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోను పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11:15 గంటలకు ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ చేరుకొంటారు. ఢిల్లీ -డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ లో ఉన్నత భాగమైన వైల్డ్‌లైఫ్ కారిడార్ గురించి ప్రధానమంత్రి సమీక్షిస్తారు. ఉదయం దాదాపు 11:40 గంటలకు ప్రధాని డెహ్రాడూన్ సమీపంలో జై మా దాత్ కాళీ ఆలయాన్ని దర్శించుకొని, పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత, ఇంచుమించు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధానమంత్రి డెహ్రాడూన్‌లో ఒక జనసభలో పాల్గొని, ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.