ఇథియోపియాలోని అడిస్అబాబాలో అడ్వా విజయ స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని
December 17th, 01:44 pm
అడిస్అబాబాలోని అడ్వా విజయ స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. 1896లో జరిగిన అడ్వా యుద్ధంలో తమ దేశ సార్వభౌమత్వం కోసం ప్రాణాలర్పించిన ఇథియోపియన్ వీర సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించారు. అడ్వా వీరుల చిరతర స్ఫూర్తికీ, దేశం గర్వించదగిన స్వతంత్రత, వైశిష్ట్యం, చేతనా పరంపరకు ఈ స్మారకం ప్రతీక.ఇథియోపియాలో ప్రధానమంత్రి పర్యటన: ముఖ్య నిర్ణయాలు
December 16th, 10:41 pm
ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి ఉన్నతీకరించుకోవడం..ఇథియోపియాలో ప్రధానమంత్రికి ప్రత్యేక స్వాగతం
December 16th, 06:21 pm
ఇథియోపియాతో తొలి ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అడ్డిస్ అబాబా చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఇథియోపియా ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ అబీ అహ్మద్ అలీ నుంచి ప్రత్యేకమైన, ఆత్మీయమైన స్వాగతం లభించింది.