ఆలోచనల్లో, పనుల్లో క్రమశిక్షణకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని సంస్కృత సుభాషితం ద్వారా చెప్పిన ప్రధానమంత్రి
February 05th, 09:49 am
జీవితంలో స్పష్టమైన ఆలోచనలకీ, దృఢ సంకల్పానికీ ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు. అలాగే నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల సంకటాలు ఎదురవుతాయని కూడా తెలియజెప్పడం కోసం ఆయన.. మన ప్రాచీన జ్ఞానం మనకిచ్చిన ఓ సందేశాన్ని గురించి ప్రస్తావించారు.కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 28th, 02:39 pm
ఈ విశిష్ట సందర్భంలో మీ అందరితో మమేకం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య విధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తన 125 ఏళ్ల ప్రస్థానంలో ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించింది. ఈ నేపథ్యంలో ఆర్య వైద్యశాల వ్యవస్థాపకులైన వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాను. ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 28th, 02:25 pm
కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇటువంటి పవిత్ర సందర్భంలో అందరితోనూ మమేకం కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుర్వేద వైద్యవిధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన కొనియాడారు. ఈ మేరకు 125 ఏళ్ల ప్రస్థానంలో ఈ సంస్థ ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను స్మరించుకుంటూ, ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.3PM calls for enhancing the input of intellectual thinktanks in policy frameworks Launches the book "Getting India Back on track – an action agenda for reform"
June 08th, 08:35 pm
PM calls for enhancing the input of intellectual thinktanks in policy frameworks Launches the book Getting India Back on track – an action agenda for reform