The North East will lead India's future growth: PM Modi at inauguration of Lokapriya Gopinath Bardoloi International Airport in Guwahati, Assam

December 20th, 03:20 pm

Marking a transformative milestone in Assam’s connectivity, PM Modi inaugurated the new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport in Guwahati. He emphasised that for him, the development of Assam is not only a necessity but also a responsibility and an accountability. The PM highlighted that in the past eleven years, development projects worth lakhs of crores of rupees have been initiated for Assam and the Northeast.

PM Modi inaugurates New Terminal Building of Lokapriya Gopinath Bardoloi International Airport in Guwahati, Assam

December 20th, 03:10 pm

Marking a transformative milestone in Assam’s connectivity, PM Modi inaugurated the new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport in Guwahati. He emphasised that for him, the development of Assam is not only a necessity but also a responsibility and an accountability. The PM highlighted that in the past eleven years, development projects worth lakhs of crores of rupees have been initiated for Assam and the Northeast.

22వ ఆసియాన్ - ఇండియా శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభ ప్రసంగం

October 26th, 02:20 pm

నా ఆసియాన్ కుటుంబంతో మరోసారి కలిసే అవకాశం లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.

Prime Minister’s participation in the 22nd ASEAN-India Summit in Kuala Lumpur

October 26th, 02:06 pm

In his remarks at the 22nd ASEAN-India Summit, PM Modi extended his heartfelt congratulations to Malaysian PM Anwar Ibrahim for ASEAN’s successful chairmanship. The PM said that ASEAN is a key pillar of India’s Act East Policy and expressed confidence that the ASEAN Community Vision 2045 and the vision of a Viksit Bharat 2047 will together build a bright future for all humanity.

22వ ఆసియన్-భారత్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనడం

October 25th, 09:48 am

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి మోదీ అక్టోబర్ 26, 2025న జరిగే 22వ ఆసియన్ - భారత శిఖరాగ్ర సమావేశానికి వర్చువల్‌గా హాజరవుతారు. మా యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు ఇండో-పసిఫిక్ దృక్పథానికి అనుగుణంగా, ఆసియన్-భారత్ సంబంధాలలో పురోగతిని ప్రధాని మోదీ ఆసియన్ నాయకులతో సంయుక్తంగా సమీక్షిస్తారు.

మిజోరాంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

September 13th, 10:30 am

అందమైన ఈ నీలి పర్వత క్షేత్రాన్ని కాపాడుతున్న సర్వోన్నతుడైన దేవుడు పతియన్‌కు నమస్కరిస్తున్నాను. నేనిక్కడ మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నాను. దురదృష్టవశాత్తు వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఐజ్వాల్‌లో మీ మధ్య లేనందుకు చింతిస్తున్నాను. కానీ ఈ మాధ్యమం నుంచి కూడా మీ ప్రేమాదరాలను నేను ఆస్వాదిస్తున్నాను.

మిజోరంలోని ఐజ్వాల్‌లో 9వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభించిన ప్రధానమంత్రి

September 13th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మిజోరంలోని ఐజ్వాల్‌లో రూ. 9000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. రైల్వేలు, రోడ్డు మార్గాలు, ఇంధనం, క్రీడలు వంటి అనేక రంగాలకు ఈ ప్రాజెక్టులు ప్రయోజనం కలిగించనున్నాయి. వీడియో అనుసంధానం ద్వారా సభికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.. నీలి పర్వతాలతో కూడిన అందమైన ఈ భూమిని రక్షిస్తున్న భగవాన్ పతియాన్‌కు నమస్కరించారు. తాను మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నానన్న ప్రధానమంత్రి.. ప్రతికూల వాతావరణం కారణంగా ఐజ్వాల్‌లో ప్రజలను కలుసుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మాధ్యమం ద్వారా కూడా తాను ప్రజల ప్రేమ, ఆప్యాయతల అనుభూతిని పొందగలనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

భారత్ - సింగపూర్ సంయుక్త ప్రకటన

September 04th, 08:04 pm

గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ భారత్‌లో అధికారికంగా పర్యటించిన సందర్భంగా భారత్, సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళికపై సంయుక్త ప్రకటన:

సింగపూర్ ప్రధానితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం

September 04th, 12:45 pm

ప్రధానమంత్రి శ్రీ వాంగ్ పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత మొదటిసారిగా భారత్ అధికార పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ పర్యటన మరింత మహత్తరమైంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత ప్రస్తుతం 60వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.

ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ శాంతిభద్రతల కమిషన్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి భేటీ

August 31st, 04:50 pm

టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ శాంతిభద్రతల కమిషన్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు.

భారత్-ఫిజీ సంయుక్త ప్రకటన: పరస్పర స్నేహభావం స్పూర్తిగా భాగస్వామ్యం

August 25th, 01:52 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. ఫిజీ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ సితివేని రబుకా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు ఫిజీ ప్రధాని అధికారిక పర్యటన భారత్‌లో కొనసాగనుంది. ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న శ్రీ రబుకా వెంట ఆయన సతీమణి, ఫిజీ వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ ఆంటోనియో లాలాబలావు, ఫిజీ రిపబ్లిక్ ప్రభుత్వ సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు.

భారత ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంయుక్త ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం

August 05th, 11:06 am

భారతదేశానికి వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన బృందానికి మొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాది భారత్, ఫిలిప్పీన్స్ 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకలను జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన దౌత్య సంబంధాలు ఈమధ్యే ప్రారంభమైనవైనప్పటికీ, మన నాగరికతల బంధం చాలా పురాతనమైనది. ఫిలిప్పీన్స్ రామాయణ రూపం అయిన మహారదియా లవానా మన సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతను తెలియజెబుతుంది. ఇరుదేశాల జాతీయ పుష్పాలతో విడుదల చేసిన తపాలా స్టాంపులు మన స్నేహ పరిమళాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

సిక్కిం@50 కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

May 29th, 10:00 am

సిక్కిం గవర్నరు శ్రీ ఒ.పి.ప్రకాశ్ మాథుర్ గారూ, ప్రియతమ ముఖ్యమంత్రీ నా మిత్రుడూ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారూ, నా పార్లమెంటు సహచరులు డోర్జీ షెరింగ్ లెప్చా గారూ, డాక్టర్ ఇంద్రా హంగ్ సుబ్బా గారూ.. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులందరూ, సోదరీ సోదరులారా!

‘సిక్కిం@50’ సంబరాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

May 29th, 09:45 am

గ్యాంగ్‌టక్‌లో నేడు జరిగిన ‘సిక్కిం@50’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘లక్ష్యానికి తగిన పురోగతి, వృద్ధిని పెంపొందించే ప్రకృతి’ అన్న ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 ఏళ్లు పూర్తయిన ఈ ప్రత్యేకమైన రోజున ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందోత్సాహాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్నప్పటికీ, ప్రతికూల వాతావరణం వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని చెప్పారు. త్వరలోనే సిక్కింలో పర్యటించి వారి విజయాలు, వేడుకల్లో భాగమవుతానని మాటిచ్చారు. గడిచిన 50 ఏళ్లలో వారు సాధించిన విజయాలను చాటే రోజుగా దీనిని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేయడంలో సిక్కిం ముఖ్యమంత్రి, ఆయన బృందం ఉత్సాహంతో వ్యవహరించారంటూ ప్రశంసించారు. సిక్కిం రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

భారత్-థాయ్‌లాండ్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన

April 04th, 07:29 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 3, 4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా “బంగాళాఖాత ప్రాంత బహుళరంగ సాంకేతిక-ఆర్థిక సహకార కూటమి” (బిమ్‌స్టెక్‌) 6వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి గౌరవనీయ పైటోన్‌టాన్‌ షినవత్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బ్యాంకాక్‌లోని ప్రధాన పరిపాలన భవనంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

థాయిలాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

April 03rd, 08:42 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధికారిక థాయిలాండ్‌ పర్యటనలో భాగంగా ఈరోజు బ్యాంకాక్‌లో థాయిలాండ్ ప్రధాని శ్రీ పేటోంగ్‌టార్న్ షినవత్రాతో భేటీ అయ్యారు. ప్రభుత్వ అధికారిక నివాసానికి చేరుకున్న ప్రధానమంత్రికి షినవత్రా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. వీరిరువురి మధ్య ఇది రెండో సమావేశం. 2024 అక్టోబర్‌లో వియంటియాన్‌లో జరిగిన ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ఇరువురు నేతలు తొలిసారిగా భేటీ అయ్యారు.

థాయ్ లాండ్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

April 03rd, 03:01 pm

మార్చి 28న ఇక్కడ సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణ నష్టానికి భారత ప్రజల తరఫున నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

2025 ఏప్రిల్ 03-06 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంకలలో ప్రధానమంత్రి పర్యటన

April 02nd, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి (ఏప్రిల్ 3-4, 2025) థాయిలాండ్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఆహ్వానం మేరకు (ఏప్రిల్ 4-6, 2025) శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు.

గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 పెట్టుబడులు, మౌలికవసతుల సదస్సు 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 25th, 11:10 am

తూర్పు, ఈశాన్య భారతం నేడు నూతన భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. భారత ఘన చరిత్రలో తూర్పు రాష్ట్రాల పాత్ర విశేషమైంది, అలాగే నేడు అభివృద్ధి చెందిన భారత్ సాధనలోనూ తూర్పు, ఈశాన్య ప్రాంతాలు కీలకం కానున్నాయి. అసోం సామర్థ్యం, అబివృద్ధిని ఈ అడ్వాంటేజ్ అసోం సదస్సు ప్రంపంచంతో అనుసంధానిస్తుంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అసోం ప్రభుత్వానికి, హిమంత జీ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రజలు అక్షరమాలను నేర్చుకునేటప్పుడు, ‘ఏ అంటే అసోం' అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు అని 2013 ఎన్నికల ప్రచారంలో యాదృచ్చికంగా నేను చెప్పిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది.

పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో అడ్వాంటేజ్ అసోం 2.0 శిఖరాగ్ర సదస్సు 2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 25th, 10:45 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అసోంలోని గౌహతి లో అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతూ, భారతదేశ తూర్పు ఈశాన్య ప్రాంతాలు ఈ రోజు భవిష్యత్తు వైపు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాయి. అడ్వాంటేజ్ అసోం అనేది అసోం సామర్థ్యాన్ని, పురోగతిని ప్రపంచంతో పెనవేయడానికి ఒక బృహత్తర చొరవ అని శ్రీ మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధిలో తూర్పు ప్రాంతం పోషించిన ప్రధాన పాత్రకు చరిత్రే సాక్ష్యమని ఆయన అన్నారు. ఈ రోజు వికసిత్ భారత్ వైపు మన పురోగమనంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు తమ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్వాంటేజ్ అసోం అదే స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అసోం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. 'ఎ ఫర్ అసోం' అనేది ప్రామాణికంగా మారడానికి ఎంతో దూరం లేదని 2013లో తాను చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.