కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు వెయిట్ లిఫ్టర్ శ్రీ అచింత్ శివులి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 01st, 12:48 pm
బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు వెయిట్ లిఫ్టర్ శ్రీ అచింత్ శివులి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. భారతదేశం క్రీడాకారిణుల మరియు క్రీడాకారుల దళం కామన్ వెల్థ్ గేమ్స్ కు బయలుదేరివెళ్లే సందర్భంలో ఇటీవల శ్రీ అచింత్ శివులి తో శ్రీ నరేంద్ర మోదీ తాను జరిపిన సంభాషణ తాలూకు వివరాల ను కూడా శేర్ చేశారు.