మాల్దీవుల అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ
July 25th, 08:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాలేలోని అధ్యక్షుడి కార్యాలయంలో మాల్దీవుల దేశాధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌లో అధ్యక్షుడు ముయిజు ఘనంగా సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్యనున్న లోతైన స్నేహ బంధాన్ని, హృదయపూర్వక వాతావరణాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది.