అక్టోబర్ 30,31 తేదీల్లో గుజరాత్‌లో ప్రధాని పర్యటన

October 29th, 10:58 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. అక్టోబర్ 30 సాయంత్రం 5:15 సమయంలో కేవడియాలోని ఏక్తానగర్లో ఈ-బస్సులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ఏక్తానగర్‌లో రూ.1,140 కోట్లకు పైగా విలువైన వివిధ మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.