భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
August 15th, 07:26 pm
మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:52 pm
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్‌ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.రైతులు దేశానికి వెన్నెముక: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ ప్రశంస
August 15th, 12:02 pm
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ రైతులకు ప్రశంసలు అందించారు. పరాధీనత నుంచి స్వావలంబన దిశగా జరిగిన జాతి ప్రయాణంలో వారు వెన్నెముకగా నిలిచారన్నారు. వలస పాలన దేశాన్ని పేదరికంలో ముంచిందనీ, అయితే, రైతుల అవిశ్రాంత కృషి వల్లే భారత ధాన్యాగారాలు నిండి, దేశం పూర్తి స్వతంత్రతను సాధించిందన్నారు. రైతుల పట్ల కృతజ్ఞతా భావం, భారత వ్యవసాయం భవిష్యత్తు దార్శనికత ఆయన ప్రసంగంలో ప్రధానంగా చోటు చేసుకున్నాయి.79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగం: 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా దార్శనికత
August 15th, 11:58 am
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి 103 నిమిషాల పాటు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి శ్రీ మోదీ చేసిన ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యంతో సాహసోపేతమైన ప్రణాళికను ఇచ్చారు. స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి పెట్టిన ప్రధాని.. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య ప్రకటనలు
August 15th, 10:32 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పన్నెండో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా.. భవిష్యత్ భారత పురోగమనంలో తదుపరి అధ్యాయానికి ఎర్రకోటను వేదికగా ఎంచుకున్నారు. దేశం- భవిష్యత్తులోకి అడుగు పెట్టడమే కాదు... ఉరకలేసేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చేలా.. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుసగా పలు సాహసోపేతమైన ప్రకటనలు చేశారు.ప్రధానమంత్రి మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: సంస్కరణ, స్వావలంబన, ప్రతి భారతీయుడికి సాధికారత కల్పించే దార్శనికత
August 15th, 10:23 am
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. భారతదేశ స్వావలంబన, పరివర్తన ప్రయాణాన్ని ప్రధానంగా తెలియజేశారు. గత దశాబ్దంలో సంస్కరణలు, గణనీయమైన పనితీరుతో భారత్ పరివర్తన చెందిందని.. కానీ ఇప్పుడు మరింత శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. చట్టాలు, నిబంధనలు, వివిధ ప్రక్రియలు సరళీకృతంగా ఉండే.. పారిశ్రామిక వాతావరణానికి ప్రోత్సాహం లభించే, ప్రతి భారతీయడు వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడే విధంగా ఆధునిక, సమర్థవంతమైన, ప్రజలకు అనుకూలమైన వ్యవస్థను సృష్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.స్వయంసమృద్ధ భారత్: శక్తిమంతమైన, వికసిత భారత్‌కు పునాది
August 15th, 10:20 am
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- శక్తిమంతమైన, వికసిత భారత్ సాకారం కావడంలో స్వయంసమృద్ధ భారత్ కార్యక్రమం పునాది కాగలదని పేర్కొన్నారు. ఈ మేరకు రక్షణ, సాంకేతిక, ఇంధన, అంతరిక్ష, తయారీ రంగాల్లో మన దేశం ఇప్పటికే పురోగతి సాధించిందని ఆయన ఉటంకించారు. ఈ విధంగా వికసిత భారత్ కీలక పునాదులలో స్వావలంబన ఒకటని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రధానంగా ప్రస్తావిస్తూ- దేశానికి ఎదురయ్యే ముప్పులను నిర్ణయాత్మకంగా తిప్పికొట్టడంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, స్వదేశీ సామర్థ్యం ప్రధానమని ఆయన చెప్పారు. దేశ పటిష్ఠత, గౌరవంతోపాటు 2047నాటికి వికసిత భారత్ దిశగా పయనంలో స్వావలంబన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
ఈ స్వాతంత్య్ర మహోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్న వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సమష్టి విజయానికి ప్రతీక. మనందరికీ గర్వకారణం. మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. దేశంలో ఎప్పటికప్పుడు ఐక్యతా స్ఫూర్తి బలోపేతమవుతోంది. 140 కోట్ల భారతీయులు ఈ రోజు మువ్వన్నెల్లో మెరుస్తున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ రెపరెపలాడుతోంది. ఎడారులయినా, హిమాలయ శిఖరాలయినా, సముద్ర తీరాలయినా, లేదా జనసమ్మర్ధ ప్రాంతాలయినా.. అంతటా ఒకే నినాదం, ఒకే ఉత్సాహం. మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే మాతృభూమి కీర్తనే మార్మోగుతోంది.India celebrates 79th Independence Day
August 15th, 06:45 am
PM Modi, in his address to the nation on the 79th Independence day paid tribute to the Constituent Assembly, freedom fighters, and Constitution makers. He reiterated that India will always protect the interests of its farmers, livestock keepers and fishermen. He highlighted key initiatives—GST reforms, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, National Sports Policy, and Sudharshan Chakra Mission—aimed at achieving a Viksit Bharat by 2047. Special guests like Panchayat members and “Drone Didis” graced the Red Fort celebrations.