ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ సంచికను అక్టోబరు 8న ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 07th, 10:27 am
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 పరంపరలో 9వ సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8న ఉదయం సుమారు 9:45 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభిస్తారు. ఇది ఆసియాలో టెలికం, మీడియా, టెక్నాలజీ రంగాలకు సంబంధించిన భారీ కార్యక్రమం.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్
August 27th, 08:32 pm
ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం అంశంపై యూరోప్, అమెరికా, ఉక్రెయిన్ నేతలు ఇటీవల నిర్వహించిన సమావేశాలపై అధ్యక్షుడు శ్రీ స్టబ్ తన ఆలోచనలను శ్రీ మోదీకి తెలిపారు.న్యూఢిల్లీలో భారత-ఐరోపా సమాఖ్య వాణిజ్య-సాంకేతిక మండలి రెండో సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన
February 28th, 06:25 pm
భారత-ఐరోపా సమాఖ్య (ఇయు) వాణిజ్య-సాంకేతిక మండలి (టిటిసి) రెండో సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్; వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్; ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ దీనికి సహాధ్యక్షత వహించారు. అలాగే ‘ఇయు’ వైపునుంచి ‘సాంకేతికత సర్వాధిపత్యం-ప్రజాస్వామ్యం-భద్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి హెన్నా విర్కునెన్; ‘వాణిజ్యం-ఆర్థిక భద్రత-అంతర సంస్థాగత సంబంధాలు-పారదర్శకత’ కమిషనర్ శ్రీ మారోస్ సెఫ్కోవిచ్; అంకుర సంస్థలు-పరిశోధన-ఆవిష్కరణ’ కమిషనర్ ఎకటెరినా జహరీవా సహాధ్యక్షులుగా వ్యవహరించారు.