భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో 11 ఏళ్లుగా గొప్ప మార్పు: ప్రధానమంత్రి

June 11th, 10:17 am

భారత్ వృద్ధి ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టాన్ని గురించి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తెలియజేశారు...11 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కల్పనలో ఓ క్రాంతి చోటుచేసుకుందని ఆయన అన్నారు. దశాబ్ది కాలానికి పైగా గణనీయ మార్పును ఆవిష్కరించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిందని శ్రీ మోదీ అభివర్ణించారు. మౌలిక సదుపాయాల కల్పనలో... అంటే రైల్వేలు, హైవేలు, ఓడరేవులతో పాటు విమానాశ్రయాల ఏర్పాటులో... భారత్ సాధించిన విశేష ప్రగతిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో సంధానం (కనెక్టివిటీ) పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ విస్తరించిందని, జీవన సౌలభ్యం మెరుగవడంతో పాటు పౌరులకు సమృద్ధి కూడా ఇనుమడించిందన్నారు.