దేశం స్వయంసమృద్ధిని పటిష్టపరుచుకొంటున్న వేళ.. యువత నాయకత్వంలో సాంకేతిక నవకల్పన జోరుగా సాగుతోందంటూ ప్రధానమంత్రి ప్రశంసలు
June 12th, 10:00 am
సాంకేతిక శక్తికి ఉన్న సామర్థ్యాన్ని ఇంతలంతలుగా విస్తరింప చేయడంతో పాటు భారత్ స్వయంసమృద్ధిని రోజురోజుకూ పెంచడంలో మన దేశ యువ నూతన ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసలు కురిపించారు. గత 11 సంవత్సరాల్లో, నవకల్పన మాధ్యమ శక్తిని మన యువతీయువకులు గణనీయ స్థాయిలో వినియోగించుకొనేటట్లుగా చూడడం ఒక్కటే కాకుండా, ప్రపంచంలో సాంకేతిక మహాశక్తిగా ఇండియా స్థానాన్ని కూడా ‘డిజిటల్ ఇండియా’ బలోపేతం చేసిందని ఆయన అన్నారు.